మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఓరియంట్ బాధిత ఆదివాసి కుటుంబాలకు జరిగిన అన్యాయం -13

ఓరియంట్ బాధిత ఆదివాసి

కుటుంబాలకు జరిగిన అన్యాయం -13

 ఓరియంట్ నిర్మాణంలో 32

ఎకరాల భూమిని కోల్పోయి

పరిహారం, ఉద్యోగాల కోసం

30 ఏళ్లుగా  ఎదురు

చూస్తున్న మడావి లింగు 

వారసులు.

- పది ఎకరాల భూమికి మాత్రమే పరిహారం చెల్లించి  22 ఎకరాల భూమి ఆక్రమణ.

- జిల్లా సర్వే అధికారుల కొలతల్లో ఓరియంట్ ఆధీనంలోనే భూమి ఉందని తేలిన పంచనామా కాపీ ఇవ్వడంలో రెవెన్యూ శాఖ తీవ్ర నిర్లక్ష్యం. 

న్యాయం కోసం అమాయక ఆదివాసి కుటుంబం 30 ఏళ్లుగా ఎదురు చూపులు. 

 ఓరియంట్ లో భూములు కోల్పోయిన సోము కుటుంబ సభ్యులు 

 మడావి  సోము దంపతులు 

 మడావి  సోము కొడుకులు నిరుద్యోగులుగా ఉన్న లింగు, రఘు కుటుంబ సభ్యులు.


Scv News Kasipet:--

 అడవిని నరికి  పోడు వ్యవసాయం చేసుకుంటూన్నా దేవాపూర్ ప్రాంతంలోని గిరిజనులకు  నైజాం ప్రభుత్వ హాయంలో జీవనాధారం కోసం ఒక్కొక్క కుటుంబానికి 16 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. మడావి లింగు కుటుంబానికి కూడా రెండు సర్వే నెంబర్లలో 32 ఎకరాలు ఉండేది. ఒక సర్వే నెంబర్ లోని 16 ఎకరాలలో  కుమారులు సోము, జంగు లకు చెరి 8 ఎకరాలు ఆ భూములు తండ్రి నుండి వారసత్వంగా వచ్చాయి . ఈ భూముల్లో  వర్షాధార పంటలు జొన్న,కంది,పెసర,ఆముదం లాంటి పంటలు పండించుకుని మడావి  సోము,జంగు కుటుంబాలు దశాబ్దాలుగా హాయిగా జీవనం సాగించింది.

దేవాపూర్ లో 1979లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పడడంతో తమ పట్టా భూమి మొత్తాన్ని కోల్పోయారు. కోల్పోయిన భూముల్లో పది ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించి ఇద్దరికీ ఉద్యోగాలు ఇచ్చి ఓరియంట్ యాజమాన్యం  చేతులు దులుపుకున్నారు. మిగతా  22 ఎకరాల భూమికి ఇంతవరకు పరిహారం అందలేదు.తాము కోల్పోయి న భూమికి పరిహారం చెల్లించాలని యాజమాన్యాన్ని సంప్రదిస్తే 'మీ భూమి తమ ఆధీనంలో లేదని, రెవెన్యూ వారిని అడగండి, భూసేకరణలో తాము తీసుకున్న భూమికి వారు సూచించిన వారికి ఉద్యోగాలు పరిహారం ఇచ్చామని ' అంటూ ఓరియంట్ యాజమాన్యం బుకాయి స్తుంది. 'ఒకే సర్వే నంబరు మీద ఉన్న భూములు 10 ఎకరా లు మీ ఆధీనంలో ఉండి మిగతా 22 ఎకరాల భూమి ఎక్కడికి పోతుందని  అమాయక ఆదివాసి కుటుంబాలు వేసే ప్రశ్నలకు ఓరియంట్ యాజమాన్యం సమాధానం చెప్పడం లేదు. పరిహారం, ఉద్యోగాల కోసం గత 30 ఏళ్లుగా మడావి లింగు,జంగు వారసులు రెవెన్యూ కార్యాలయం,ఓరియంట్ యాజమా న్యం చుట్టు దశాబ్దాలుగా తిరుగు తూనే ఉన్నా పట్టించుకునే వారులేరు. కోల్పోయిన భూమి కింద  తమ కుటుం బాలను పోషించుకునేఎందుకు కనీసం దినసరి కూలీ పనులన్న ఇవ్వాలని వేడుకున్నా  కనికరించడంలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీవనాధారమైన  భూమిని కోల్పోయి పరిహారము ఉద్యోగాల్లేక, సోము,జంగు కుటుంబ వారసులు కడు పేదరికంలో జీవనం సాగిస్తూన్నారు. వారి కుటుంబానికి జరిగిన అన్యాయం పై 'scv News' అందిస్తున్న ప్రత్యేక  కథనం ఇది...

దేవాపూర్ గ్రామం చెందిన  మడావి లింగుకు సోము, జంగు ఇద్దరు కొడుకులు. సర్వే నెంబర్ 84 /55 లో మడావి లింగు తండ్రి పేరు జైతు పేరిట 16 ఎకరాలు, అతని కొడుకులు సోము, జంగుల పేరిట  సర్వే నెంబర్ 84/40 లో చెరి 8 ఎకరాలు 16 ఎకరాల పట్టా భూములు ఉండేవి. ఓరియంట్ కర్మాగారం నిర్మాణంలో  మడావి లింగు కుటుంబానికి చెందిన మొత్తం 32 ఎకరాల భూమి కోల్పోయారు.

సర్వే నెంబర్ 84 /40 లో కోల్పోయిన 16 ఎకరాల భూమికింద మడావి సోము కు, జంగు కుమారుడు బాదిరావుకు ఓరియంట్ లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 16 ఎకరాలలో  3.13 ఎకరాలు మాత్రమే  భూసేకరణలో ఓరియంట్ యజమాన్యం కు రెవెన్యూ అధికారులు అప్పచెప్పి ఆ భూమికి మాత్రమే పరిహారం చెల్లించారు. మిగతా 12.2 7 ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదు. వారి తండ్రి మడావి లింగు తండ్రి పేరు జైతు పేరిట ఉన్న సర్వే నెంబర్ 84 / 55 పేరిట ఉన్న 16 ఎకరాల భూమి మొత్తం భూసేకరణ లో పోయి పరిహారం ఉద్యోగాలు ఇవ్వ లేదని లింగు కుమారులు సోము, జైతుల వారసులు  ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 84/ 55 లోని 16 ఎకరాల భూమిలో 6.03 ఎకరాలు మాత్రం ఓరియంట్ భూసేకరణలో తీసుకుందని ఉంది.  మిగతా 9.37 ఎకరాల భూమి ఎక్కడ ఉందో తేలడం లేదు. తండ్రి లింగు పేరిట ఉన్న భూమి కింద నిరుద్యోగులు గా ఉన్న తమ కుమారులు రఘు, లింగులకు ఉద్యోగాలు ఇవ్వాలని సోము కోరుతున్నారు.

 ఓరియంట్ నిర్మాణంలో తాము కోల్పోయిన 32 ఎకరాల భూమిలో 22 ఎకరాల భూమికి పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని సోము,జైతులు ఓరియంట్ యాజమాన్యం పై గత 30 ఏళ్లుగా  పోరాడుతున్నారు. ఓరియంట్ యాజమాన్యం ' మీ భూములు మా స్వాధీనంలో లేవు, రెవెన్యూ అధికారులు ద్వారా సేకరించిన భూమిని మాత్రమే తమ వద్ద ఉందాని, వారు సూచించిన వారికి  ఉద్యోగాలు, పరిహారం చెల్లించాము కాబట్టి తమకు సంబంధం లేదని' తప్పించుకుంటుంది. మరోవైపు తమకున్న  32 ఎకరాల భూమిలో 30,40 ఏళ్లుగా  ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పడేవరకు 1980 సంవత్సరం వరకు భూముల్లో వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకుని హాయిగా బ్రతకమని, ఒకే సర్వే నెంబర్ల పై ఉన్న 32 ఎకరాల లో 10 ఎకరాల భూమి మీ ఆధీనం లో ఉండి మిగతా భూమి ఎటు పోతుందని మడావి సోము,జంగు వారసులు ఓరియంట్ యాజమాన్యం ని ప్రశ్నించిన పట్టించుకోవడం లేదు.  

తాము కోల్పోయిన భూమికి పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని గత 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు నాయకులు అధికారు ల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడం తో చివరకు 2008లో తమ 32 ఎకరాల పట్టా భూములు ఎక్కడ ఉన్నాయో తేల్చాలని సోము,జంగు వారసులు జిల్లా సర్వే అధికారులను సంప్రదించా రు. ఓరియంట్ భూసేకరణలో పోగా మిగిలిన సర్వే నెంబర్ 84/40 లోని 12.27 ఎకరాల భూమి ఎక్కడ ఉందో  చూపాలని వారు జిల్లా సర్వే అధికారు లకు  రూ.360 చెల్లించి చాలన్ నెంబర్ 15853 తేదీ19.9.2008 లో కట్టారు. తమ తండ్రి మడావి లింగు పేరిట ఉన్న సర్వే నెంబర్ 84 /55 లోని 16 ఏకరాల లో ఓరియంట్ భూసేకరణలో పోగా మిగిలిన 9.37 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపాలని  చాలాన్ నంబర్  23191 తేదీ 20. 12. 2008 లో కట్టారు. చాలన్ కట్టి రెండు సంవత్సరాలు గడిచినా కొలిచేందుకు సర్వే అధికారు లు ముందుకు రాకపోవడంతో  హైకోర్టు ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 2010లో జిల్లా సర్వే అధికారు లు ఓరియంట్ ఆధీనంలోని భూముల ను కొలిచారు. వీరి మొత్తం భూమి 32 ఎకరాల ఓరియంట్ ఆధీనంలోనే ఉంద ని తేలిందని సోము,జంగు వారసులు తెలుపుతున్నారు. కొలిచిన భూముల కు సంబంధించిన పంచనామా కాపీ నివ్వాలని పన్నెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 భూములు కోల్పోయి  పేదరికంలో సోము వారసులు.

 సోము కొడుకులు లింగు,రఘు లకు చేసుకునేందుకు వ్యవసాయ భూమి లేకపోవడంతో కూలి పనులు చేసుకుని బ్రతుకులను వెళ్లదీస్తున్నారు. తమ తాత తండ్రి వారసత్వంగా వచ్చిన 22 ఎకరాల భూమి ఓరియంట్ లో కోల్పోయామని కనీసం దినసరి కూలీ అయిన ఇప్పించాలని యాజమాన్యా న్ని కోరినా పట్టించుకోవడం లేదని లింగు,రఘు వాపోతున్నారు. గత 20  ఏళ్లుగా తమ భూములకు పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని కలెక్టర్, కోర్టుల చుట్టూ తిరిగి అప్పుల పాలయ్యామని, భార్య పేరు మీద ఉన్న మంగళ సూత్రాలు  కూడా అమ్ముకున్నామని   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు.

స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాల నాయకులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఓరియంట్ భూనిర్వాసిత ఆదివాసులు కోరుతున్నారు.