నిరుపేద కుటుంబానికి 'అమ్మ ఒడి స్వచ్ఛంద సంస్థ ' సహాయం.
- బ్రెయిన్ ఆపరేషన్ కోసం సహాయం చేసి అండగా నిలిచిన అమ్మ ఒడి ఫౌండర్ అజ్మీర మోహన్, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ
- రూ.లక్ష నగదు, మూడు నెలల సరుకులు అందజేత.
-- అమ్మ ఒడి ఫౌండర్ ను అభినందించిన పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ.
![]() |
| పెద్దపల్లి న్యూ కాలనీకి చెందిన నిరుపేద నందికొండ శ్రీధర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన అమ్మ ఒడి సంస్థ. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ చెందిన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేద మహిళకు అమ్మ ఒడి ఫౌండర్ అజ్మీర మోహన్, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ సహాయం అందించి అండగా నిలిచారు.
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నందికొండ శ్రీధర్-హరిప్రియ అనే దంపతులు 12 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, చిన్న పాప పుట్టిన తరువాత హరిప్రియ కి చూపు మందగించడంతో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ లయన్స్ క్లబ్ తరుపున ఆసుపత్రికి పంపించగా అక్కడ టెస్టులు జరిపి బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టినది అని త్వరగా ఆపరేషన్ చేయాలని తెలిపారు.అందుకు రూ. 6 లక్షలు అవసరం అవగా ఆరోగ్య శ్రీ పథకం ధ్వారా 2.50 లక్షలు మాత్రమే వస్తాయని మిగిలినవి సొంతంగా చెల్లించాలని తెలిపారు. రోజు పని చేస్తేనే తప్ప తినలేని స్థితిలో వారికి ఇది తలకి మించిన భారమైంది. దీంతో సర్పంచ్ వేముల కృష్ణ తన సొంత డబ్బుతో వారిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మొదటగా బ్రెయిన్ లో ఉన్న నీరు ని పోగొట్టడానికి మెదడు లో స్టెంట్ వేయగా రెండు వారాలలో ఆపేరేషన్ చేయాలని దానికి రూ.3 లక్షలు కావాలని అనడంతో ఈ విషయం సోమగుడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ తన మిత్రుడైన అమ్మ ఒడిప్ఫౌండర్ అజ్మిర మోహన్ గారికి తెలపడంతో ఆయన సకాలంలో స్పందించి హేమంత్ అనే దాత సహాయంతో వారి ఆపరేషన్ కి రూ.ఒక లక్ష రూపాయలు, మూడు నెలలకు కావలసిన సరుకులు అందించారు.
ఈ సందర్భంగా అమ్మ ఒడి చైర్మన్ మోహన్ మాట్లాడుతూ వీళ్ళ లాంటి ఎంతో మందికి సహాయం చేయడం జరిగిందని, ఇంతే కాకుండా శ్రీధర్ వాళ్ళ పిల్లల్ని aకూడా చదివించే పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ అమ్మ ఒడి ధ్వారా మోహన్ మన ప్రాంత బిడ్డ గా గత àకొన్ని సంవత్సరాలుగా ఇలాంటి పేదవారికి ఎలాంటి అండా లేనివారికి చేసే సేవ భాగ్యం చాలా గొప్పదని, ఇలాగే వారు మరింత అవసరం ఉన్నవారికి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు.
ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడైన మోహన్ ఈ పదేళ్ళలో ఎంతోమందికి సహాయం చేసారని,అమ్మ ఒడి సంస్థకి రోజుకి వందలాది రిక్వెస్ట్ లు వచ్చినా కూడా అందులో శ్రీధర్ కుటుంబ పరిస్థితి చూసి సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని తెలిపారు
కార్యక్రమంలో వార్డు మెంబెర్ లు కొత్త రమేష్, బన్న హిందుమతి, పంబాల తిరుపతిలు అమ్మ ఒడి సహాయకులు కిరణ్, తిరుపతి లు పాల్గొన్నారు
