మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెద్దనపల్లి పంచాయతీలో మురికి కాలువ పనులు ప్రారంభం.

 పెద్దనపల్లి పంచాయతీలో 

మురికి కాలువ పనులు

ప్రారంభించిన సర్పంచ్

వేముల కృష్ణ .



 సోమగూడెం న్యూ కాలనీ లో కొబ్బరికాయ కొట్టి మురికి కాలువ పనులు ప్రారంభిస్తున్న పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ.

Scv News Kasipet :--

                                                      కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీలో మురికి కాలువ నిర్మాణం పనులను ఈరోజు  సర్పంచ్ వేముల కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులలో భాగంగా ఈ సైడ్ డ్రైన్ నిర్మాణం పనులు గ్రామ పంచాయతీ నిధుల నుండి 6 లక్షల రూపాయిల కెటాయించడం జరిగింద న్నారు. గ్రామంలో వర్షం పడినప్పుడల్లా నీరు ఖాళి ప్లాట్లలో నిలవడంతో గ్రామ ప్రజల ఇబ్బందులు పడుతున్నారు దీన్నీ దృష్టిలో పెట్టుకొని అత్యవసర పని క్రింద ఈ పని చేపట్టడం జరిగిందన్నారు. మురికి కాల్వల నిర్మాణంతో  సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి తులుగా జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, యంపిటిసి కె రాంచందర్, వార్డు సభ్యులు కొత్త రమేష్ పంబాల తిరుపతి, బన్న హిందుమతి బొల్లెపల్లి కొమురక్క,కో ఆప్షన్ సభ్యులు గుర్రం వజ్ర , కనకయ్య, గ్రామ పెద్దలు గుండేటి సత్య నారా యణ, శ్రావణ్ లు పాల్గొన్నారు.