మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

విద్యాశాఖ మంత్రికి ఎమ్మెస్ అప్ జిల్లా ఇన్చార్జి కలవల శరత్ వినతిపత్రం అందజేసి

 కేజీ టు పీజీ విద్య అమలు

చేయాలని ఎమ్మెస్ ఎఫ్ జిల్లా

ఇన్చార్జి కలవల శరత్ విద్యా

శాఖ మంత్రి  సబితా

ఇంద్రారెడ్డి కి వినతి పత్రం

అందజేత.

 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెస్సీ జిల్లా ఇన్చార్జి కలవల శరత్.
Scv News Kasipet:--

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యను అమలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు పరచాలని, సంక్షేమ గురుకుల పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయాలని  మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్చార్జి కలవల శరత్ ఈరోజు కాసిపేట మండలం పర్యటనకు వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. కలవల శరత్ వినతిపత్రంలో కేజీ టు పీజీ విద్య అమలుపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ లక్షల ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నరని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలలో  తక్షణమే కేజీ టు పీజీ అమలుచేయాలని కోరారు.కాసిపేట మండలంలో గురుకుల హాస్టల్ కు సొంత భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని  బెల్లంపల్లి లో నడుస్తున్న టువంటి కాసిపేట గురుకుల పాఠశాలను కాసిపేట కు మార్చాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో MSP  జిల్లా ఇంచార్జ్ కల్వల శరత్ తో పాటు మ్మార్పీఎస్ దాసరి వినయ్ నాగావత్ ప్రశాంత్ నాయక్  పాల్గొన్నారు.