మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డిచే మోడల్ పాఠశాల వసతిగృహాల ప్రారంభోత్సవం

 అభివృద్ధిలో తెలంగాణ

రాష్ట్రం దేశంలోనే అగ్రగామి

గా నిలిపిన కేసీఆర్.

- సబితా ఇంద్రారెడ్డి విద్యా

శాఖ మంత్రి.

 మోడల్ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ బోర్లకుంట వెంకటేష్  

 బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Scv News Kasipet :--

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తన  ప్రాణాలను ఎదురొడ్డి సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎనిమిదేళ్ల కాలంలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపాడని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మోడల్ స్కూల్ పాఠశాల భవనం,వసతి గృహా  భవనాల ప్రారంభో త్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గురుకులా లను ఏర్పాటు చేశాడని అన్నారు. మహిళల విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆడపిల్లలు 10వ తరగతి వరకు చదివి మానేస్తున్నారని గురుకులాలను దశలవారీగా ఇంటర్, డిగ్రీ, పీజీ, కాలేజీలు గా మార్చిన ఘనత కేసీఆర్ దే నన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లో 60 శాతం  కాకతీయ యూనివర్సిటీలో 70 శాతం మహిళలే చదువుకుంటున్నారన్నా రు. గత నాలుగేళ్లలో 1150 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజ్ గా మార్చారాని,85 డిగ్రీ కాలేజీలను,5 పిజి కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. వీటిలో 53 డిగ్రీ కాలేజీలు మహిళలకే  ఏర్పాటు చేశాడన్నారు. తెలంగాణ రాక ముందు పేద విద్యార్థులు విదేశాలలో చదువుకునే వారు కాదన్నారు. అలాంటి వారికి  రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసి విదేశాలలో చదివిస్తుదన్నారు. ప్రస్తుతం నాలుగు వేల మంది పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారన్నారు.

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు, 57 సంవత్సరాలు నిండిన వివిధ వృత్తుల వారికి ఆసరా పింఛన్ల కింద 2000 నుంచి 3000 రూపాయలు కెసిఆర్ ప్రభుత్వం అందిస్తుందన్నారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ హాయంలో  రాష్ట్రంలో 140 సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నా యన్నారు. పేదల అంతా సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. దసరా పండగ సందర్భంగా మహిళలకు  బతుకమ్మ చీరలు పంపిణీ చేసి గ్రామాల్లో ఆనందం నిలిపాడని కొనియాడారు .

ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ రవీందర్ రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, పిడి శేషాద్రి , ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.