మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మోడల్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి.

 మోడల్ స్కూల్ పాఠశాల

ఉపాధ్యాయులకు వేతనాలు

చెల్లించాలి.

 - రత్నం ప్రదీప్, జిల్లా యువజన

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.

 మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయులతో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రత్నం ప్రదీప్.



 ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగమల్లయ్య కు వినతి పత్రం అందజేస్తున్న రత్నం ప్రదీప్.

Scv News Kasipet:--

కాసిపేట మండలంలోని మోడల్ జూనియర్ కళాశాల లోని డైలీ హవర్స్ బేస్డ్ లెక్చరర్స్ కి మూడు నెలల నుండి జీతాలు లేక  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రత్నం ప్రదీప్ ఈరోజు మోడల్ పాఠశాలను సందర్శించారు.పాఠశాలలోని  డైలీ అవర్స్ బేస్డ్ లెక్చరర్లను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు . తదనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం  వెంటనే పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాన్ని  వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ పాలనలో ఉపాధ్యాయు లు సంతోషంగా లేరని కనీసం వాళ్లకి నెల నెల వచ్చే జీతాలు కూడా రావట్లేదని వాళ్లకి పూట గడవడం కూడా కష్టంగా ఉందన్నారు. మూడు నెలల నుండి జీతాలు రాకపోయినా జేబులో చిల్లి గవ్వ లేకపోయిన విద్యార్థి జీవితాలు దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు బాధ్యతతో వృత్తిని కొనసాగిస్తున్నారన్నా రు.

ఉపాధ్యాయ దినోత్సవం రోజున కూడా రాష్ట్రంలో చాలామంది ఉపాధ్యాయులు సంతోషంగా లేరని దేశాన్ని, యువతని ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయు లకు కూడా జీతాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఎవరి కోసమని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను, మూడు నెలల జీతాన్ని వెంటనే చెల్లించాల ని యూత్ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమం లో  యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బన్న రవి రాజా,శ్రావణ్, శేషు మేడ భరత్ పాల్గొన్నవారు.