ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు విఆర్ ఏ లు వినతి పత్రం అందజేత.
![]() |
| దుర్గం చిన్నయ్య కు వినతి పత్రం అందజేస్తున్న వి ఆర్ ఏలు |
Scv News Kasipeta :-
కాసిపేట మండలం ధర్మ రావు పేట రైతు వేదిక లో ఈరోజు నూతన పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని వీఆర్ఏలు వినతి పత్రం అందజేశారు.వీఆర్ఏల నిరవధిక సమ్మె భాగంగా 48వ రోజు గడిచినముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా VRA లకు పే స్కేల్ అమలు చేస్తామని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని అర్హుల గల వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి అయినది కానీ ఇప్పటివరకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇప్పటికైనా వీఆర్ఏ లకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ రోజు బెల్లంపల్లి M L.A గారికి 12 ,13 వ తేదీన జరిగే అసెంబ్లీ లో మాట్లాడాలని మా సమస్య కి పరిష్కారం చేసి 23000 కుటుంబంలో వెలుగు నింపాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
