మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మనువాదం పై బహుజన వాదం తిరగబడుతుంది...?

 దేశంలో మనువాదం పై బహుజన వాదం తిరగబడుతుంది...?

- కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో గుడి గోపురంపై నీలి జెండా ఎగురవేత.

- దసరా పండుగ సందర్భంగా మూలవాసి ద్రావిడ చక్రవర్తి రావణాసురుడు దిష్టిబొమ్మలను తగులబెట్టావద్దని బహుజన సంఘాల ఆందోళన.



 గిరిజనుల ఆరాధ్య దైవం మూలవాసులు చక్రవర్తి రావణాసురుడి దిష్టి బొమ్మను తగల బెట్ట వద్దని cars పేట మండల తహసీల్దార్ కు వినతి పత్రం ఇస్తున్న తుడుందెబ్బ నాయకులు.


కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా లో గుడి పై నీలిరంగు జెండా ఎగర వేస్తున్న బహుజనులు.

Scv News Kasipet:--

భారతదేశంలో తరతరాలుగా సుమారు రెండువేల ఆరు వందల సంవత్సరాలుగా దేశ జనాభాలో 15 శాతం ఉన్న బ్రాహ్మణీయ మనువాదు లు 85 శాతం ఉన్నా ఎస్సీ,ఎస్టి, బిసి మైనారిటీలకు చెందిన బహుజనులపై పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని 200 పైగా ఉన్న దేశాల లో ఎక్కడా లేని విధంగా ఈ దేశంలో మనుషులను నాలుగు వర్ణాలుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్రులు గా విభజించి చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. శూద్రవర్ణంలోని  బహుజనులు తమ కంటే ఎక్కువ మెజారిటీగా ఉంటే తమకు ముప్పుగా భావించి  కుట్రలు కుతంత్రాలతో వేల కులాలుగా విడగొట్టి  వీరి మధ్య ఐక్యమత్యం లేకుండా చేసి బానిసత్వం లోకి నెట్టారు. దేవుడు, ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాల పేరట పురాణాలు, ఉపని షత్తులు, ధర్మశాస్త్రాలు రచించారు. మనుధర్మ శాస్త్రం తో బహుజన వర్గాలకు ఎలాంటి స్వేచ్ఛా స్వాతం త్రాలు లేకుండా బానిసలుగా తయారు చేసుకునే వేలాది సంవత్సరాలుగా పరిపాలన ను కొనసాగిస్తున్నారు.  

పూలే, అంబేద్కర్ కృషి వల్లే బహుజన వర్గాల్లో చైతన్యం.

 దేశంలో తరతరాలుగా  బహుజనుల బానిసత్వానికి ప్రధానకారణం మనువాద బ్రాహ్మణీయ శక్తులు లేనని మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ లు పసిగట్టి,కుల వ్యవస్థ నిర్మూలన కోసం, బహుజనులో ఐక్యత, స్వేచ్ఛా స్వాతంత్రాలు సాదించేందుకు జీవితాంతం పోరాడారు. బహుజను లకు చదువు లేకపోవడం వల్లనే అజ్ఞానంలో జీవిస్తున్నారని పూలే గ్రహించారు. బహుజన వర్గాలను చైతన్యవంతం చేసి జ్ఞాన వంతులను చేసేందుకు దేశంలో మొట్ట మొదట పాఠశాలలను ప్రారంభిం చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్  మనుస్మృతి ని పారద్రోలి బహుజనులకు స్వేచ్ఛా స్వాతంత్రంతో పాటు ఎన్నో హక్కుల ను సాధించే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించాడు. దేశానికి స్వాతంత్రం వచ్చి  రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా  బహుజన వర్గాల  జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదు. మనువాద బ్రాహ్మణ కుట్రలతో  బహుజనులు ఐక్యమత్యం లేకపోవడం బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగ ఫలాలను సరిగా సద్విని యోగం చేసుకోకుండా ఇంకా బానిసత్వం లోనే మగ్గుతున్నారు. దేశంలో పేరుకు మాత్రం  భారత రాజ్యాంగం అమలులో ఉన్న తెర వెనుక ఇంకా మనుస్మృతి అమలు జరుగుతోంది. నేటికీ అంటరానితనం, కుల వివక్ష, దళిత వర్గాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి  దీనికి ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న బహుజనుల పై దాడులు మహిళల పై అత్యాచార ఘటనలే ప్రత్యక్ష నిదర్శనాలు.

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దళితులపై ఆగని దాడులు.

రాజస్థాన్ లో పాఠశాలలో అగ్రకుల ఉపాధ్యాయులు తాగే మంచినీటి కుండలోని నీటిని దళిత కులానికి చెందిన విద్యార్థి తాగడం వల్ల ఆగ్రహంతో టీచర్ కొట్టిన దెబ్బలకు విద్యార్థికి తీవ్రగాయాల య్యాయి. చావు బ్రతుకుల మధ్య విద్యా ర్థి 21 రోజులు ఆసుపత్రిలో ఉండి చని పోయిన ఘటన దేశంలోనే సంచలనం కలిగించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరిగిన హత్రాస్ లాంటి ఘాత కాలు  ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. మనువాద భావజాలం తో ఉన్న దేశ పాలకులు పట్టించు కోవడం లేదు.

 మనువాదం పై తిరగబడుతున్న బహుజన వాదం.

ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల లో అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో ఉన్న యువత చైతన్య వంతమై మనువాదంపై తిరగ బడిన ఘటనలు జరుగుతుండడం శుభపరిణామం. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో బహుజన కులాలు గుడి నిర్మాణం లో పాల్గొన్నాయి. దళిత బాలుడు ఒకరు గుడిలోని విగ్రహాన్ని ముట్టుకున్నాడని 60 వేల జరిమానా వేస్తూ ఆ కుటుంబా న్ని మనువాద బ్రాహ్మణ వర్గం  వెలి వేశారు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామంలోని బహుజనుల అంతా మనువాద బ్రాహ్మణ వర్గంపై తిరుగు బాటు చేసి గుడిని ఆక్రమించి గుడి గోపురం పై నీలి జెండా ఎగరవేయడం దేశంలో సంచలనం కలిగించి చర్చనీ యాంశంగా మారింది.

 మన మూలవాసి చక్రవర్తుల దిష్టిబొమ్మలను  మన చేత దహనం  చేయిస్తున్న మనువాదులు.

 మనువాద బ్రాహ్మణ వర్గం దసరా దీపావళి పండుగల సందర్భంగా ఈ దేశ మూలవాసీ ద్రావిడ చక్రవర్తులైన రావణా సురుడు, నరకాసురుడు,బస్మా సూరుడు మహిషాసురుడు,రాక్షసులు గా చిత్రీకరించి వారి దిష్టిబొమ్మలను వారి వారసులైన బహుజన వర్గాల చేత దాహం చేయడం  ఆనవాయితీగా మారింది. వారి నిజమైన చరిత్ర తెలియని బహుజన సోదరులంతా దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొంటూ ఆనంద పడడం మన భావ దారిద్ర్యానికి నిదర్శనం.నేడు దసరా పండగ రోజు రామ్ లీల పేరిట మనువాద బ్రాహ్మణ వర్గం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా రావణాసురుడి దిష్టిబొమ్మలను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలచే  బాణాలు వేసి తగలబెట్టి ఆనందిస్తు న్నారు. రావణా సురుడు ఈ దేశ మూలవాసీ ద్రావిడ బహుజన చక్రవర్తి అన్న సంగతి మన సోదరులకు తెలియక పోవడం విచారకరం.

 మూలవాసీ చక్రవర్తి   రావణుడి విగ్రహాలను తగలబెడితే ఊరుకోం అంటూ హెచ్చరిస్తున్నా బహుజన  సంఘాలు.

అంబేద్కర్,పూలే భావజాలంతో చైతన్య వంతమైన బహుజన  ఉద్యమ కారులు చైతన్యవంతమై మన గత చరిత్రను అసుర లైన ద్రావిడ చక్రవర్తుల జీవితాల గురించి తెలుసుకొని దసరా పండగ సందర్భంగా రావణ సూరూడి విగ్రహాలను తగలబెట్టా వద్దని గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో బహుజన ఉద్యమకారులు ఆందోళనకు దిగుతున్నారు.ఇటీవల మంచిర్యాల జిల్లాలో జిల్లాలో బహుజన సంస్కృతి పరిరక్షణ సభ పేరిట రావణాసుర దిష్టి బొమ్మను తగల బెట్టవద్దని జిల్లా  కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కాసిపేట మండలంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ దేవాపూర్ లో ప్రతి ఏటా జరిగే రావణాసుర దిష్టి బొమ్మను తగల బెట్టడం వద్దని తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం సంచలనం కలిగించింది. బహుజన సమాజం ఇప్పుడిప్పుడే చైతన్యవంతమై తమ హక్కుల కోసం, గతంలో తమ పూర్వీకులైన మూలవాసులకు జరిగిన అవమానాలు విషయమై మేల్కొంటుం ది. వీరికి అంబేద్కర్ పూలే భావజాలం తో పని చేస్తున్న అంబేద్కర్ సంఘాలు బహుజన సంఘాలు పూర్తిగా మద్దతు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 చరిత్ర తెలుసుకో లేనివాడు చరిత్రను నిర్మించలేడు.


 దేశంలోని 85 శాతం ఉన్న మూలవాసులైన బహుజనుల చరిత్ర మొత్తం వక్రీకరించ బడింది. మనలో ఐక్యమత్యం లేకుండా కులాలుగా విభజించి మన శ్రమ శక్తిని చెమట చుక్కచిందించ కుండా దోచుకుని మనల్ని బానిసత్వం లోకి నెట్టిన మనువాదులే మన చరిత్రను లిఖించారు.వారికి అనుకూలంగా వేదాలు,పురాణాలు, ఇతిహాసాలు  ఉపనిషత్తుల పేరిట అభూత కల్పనలు, కట్టుకథలను సృష్టించి అవే నిజాలని మనలను నమ్మిస్తు మన మెదళ్ళకు సంకెళ్లు వేసి మానసిక బానిసలుగా తయారు చేసుకున్నారు. ఈ దేశంలో మనువాదు లు  తరతరాలుగా చేసిన మోసాలను కట్టుకథలని నేడు బహుజన వర్గాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత చరిత్రను తెలుసుకొని బహుజన ఉద్యమాలను ఉధృతం చేసి బహుజన రాజ్యాధికారం సాధించి నప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. 

 మన అసలైన బహుజన చరిత్రను తెలుసుకుందాం.!

ఈ దేశంలోని మూలవాసుల  చరిత్ర

ఏమిటి. ? రావణాసురుడు చరిత్ర?దసరా పండుగ ఎందుకు జరుపు కుంటున్నాము?  నిజమైన చరిత్రను మన బహుజన సోదరులంతా తెలుసుకోని బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారనే లక్ష్యంతో  'సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా' విభాగం రేపటి నుండి వరుస కథనాలు ఇవ్వబోతోందని తెలియజేస్తూన్నాము.