మల్కేపల్లి ఆశ్రమ
పాఠశాలను తనిఖీ చేసిన
జిల్లా గిరిజన అభివృద్ధి
అధికారిణి.
![]() |
| ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ప్రశ్నలు అడుగుతున్నా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ. |
కాసిపేట మండలంలోని మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఈరోజు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి నీలిమ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ,8,9,10 తరగతి విద్యార్థులను విద్య ప్రమాణాల పై అనేక మైన ప్రశ్నలు వేసి, సమాధానాలను రాబట్టడం జరిగింది.తదుపరి స్టోర్ రూమ్ లోకి వెళ్లి,అన్ని సరుకులను పరిశీలించి, విద్యార్థుల మెనును పరిశీలించి, ఆ తర్వాత పాఠశాల ఉపాధ్యాయుల అందరితో సమావేశం ఏర్పాటు చేసి, అన్ని విషయాలపై సంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది, డిటిడివో నీలిమ మేడం తో పాటు, ATDO చిరంజీవి ,స్పెషల్ ఆఫీసర్ శంకర్ ,పాఠశాల ప్రధానోపాధ్యా యులు మహేశ్వర్ రెడ్డి ,పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.
