స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జన్మదిన కార్యక్రమం.
![]() |
| స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య , వైస్ ఎంపీపీ విక్రమ్ రావు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలో ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నూట ఏడవ జన్మదిన కార్యక్రమాలు అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని సర్వం త్యాగం చేశాడని, మంత్రి పదవికి కూడా రాజీనామా చేశాడని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు తెలంగాణ జాతిపిత, బడుగు బలహీన అనగారిన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ జాతి ఆయన సేవలను, వాళ్లను మర్చిపోదు అని అన్నారు. ఈ కార్యక్రమం ఎంపీటీసీలు కొండ బత్తుల రాంచందర్ నవనందులు చంద్రమౌళి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్ మాజీ జెడ్పిటిసి రావు సత్తయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, ఎంపీడీవో ఎమ్ ఎ అలీ, శ్రీనివాస్, కళ్యాణ్ రెడ్డి, మాజీ సర్పంచులు రోడ్డ రమేష్, ప్రేమ్ కుమార్, మండల టిఆర్ఎస్ నాయకులు లంక లక్ష్మణ్ లు పాల్గొన్నారు.
