మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కెసిఆర్ చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం పాలాభిషేకం

 నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన కేసీఆర్ కు కాసిపేట అంబేద్కర్ యువజన సంఘం కృతజ్ఞత పాలాభిషేకం.

 అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న అంబేద్కర్ యువజన సంఘం నాయకులు 


 అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూన్న మహిళా సర్పంచ్ లు 


Scv News Kasipet :--

 భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నూతన పార్లమెంటు భవనానికి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు  కాసిపేట  మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జాడీ రామచందర్ ఆధ్వర్యంలో  కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు కాసిపేట మండల కేంద్రంలోని  అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేసింది. మండలంలోని వివిధ గ్రామాల దళిత, గిరిజన సర్పంచులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు  ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరుపెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.


ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడి రామచందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును  దేశ పార్లమెంట్ నూతన భవనానికి పెట్టాలని కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయం అన్నారు. తీర్మానం చేసినందుకు అంబేద్కర్ సంఘాలు కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.రాష్ట్రం జిల్లాల లోని అంబేద్కర్ సంఘాలన్నీ కెసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా నూతన పార్లమెంటు భవనానికి కెసిఆర్ పేరు పెట్టాలని తీర్మానం చేయాలని కోరారు.


అంబేద్కర్ యువజన సంఘం మండల  ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ మాట్లాడుతూ నూతన పార్లమెంటు భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ తీర్మానం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. మండలంలోని గ్రామాలలో అంబేద్కర్ యువజన సంఘం అంబేద్కర్ ఆశయాలు మేరకు పని చేయాలన్నారు.




అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ భారతదేశం ఆర్థికంగా బలపడడం, రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేయడంలో  బాబాసాహెబ్ పాత్ర ఎంతో ఉందన్నారు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించ కుండా ఈ దేశ పాలకులు వివక్ష చూపార న్నారు. దేశపురోభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర అమోఘమైనది అని కొనియాడారు. నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయించడం పట్ల అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాన న్నారు.  


అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ  బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని బహుజన వర్గాల స్వేచ్ఛా,స్వాతంత్య్రాల కోసం తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసిన మహనీయ మూర్తి అని కొనియాడారు. అంబేద్కర్ త్యాగాలను, దేశ అభివృద్ధికి తాను చేసిన కృషిని కనుమరుగు చేసేందుకే కుట్రలు జరిగాయన్నారు.  దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దేశ పాలకులు అంబేద్కర్ పట్ల వివక్ష చూపుతూన్నారన్నారు. భారతరత్న అవార్డును స్వాతంత్రం వచ్చిన 30 ఏళ్ల తర్వాత అంబేద్కర్ ఇచ్చారన్నారు. బడుగు బలహీనులకు ప్రవేశ పెట్టే ప్రతి పథకానికి అంబేద్కర్ పేరు పెట్టే అర్హత ఉన్న పాలకులు పెట్టకుండా వివక్ష చూపుతున్నారన్నారు.   నూతన పార్లమెంటు భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు  ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లు గా అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవనంతో పాటు 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం పనులు కూడా త్వరిత గతిన పూర్తి చేయా లని కోరారు. నూతన అసెంబ్లీ భవనానికి కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని మండల అంబేద్కర్ యువజన సంఘం తరఫున కోరారు.


ఈ కార్యక్రమంలో కాసిపేట సర్పంచి దేవి, ఎమ్ పి టి సి అక్కపెళ్లి లక్ష్మి, చిన్న ధర్మారం సర్పంచ్ సునీత, కోమటి చేను  సర్పంచ్  శ్రీనివాస్,లంబాడి తండ డి సర్పంచ్ తిరుపతి, మామిడి గూడెం సర్పంచ్ సంపత్, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్   మండల అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య సలహాదారులు లంక లక్ష్మణ్, మండల శాఖ ఉపాధ్యక్షుడు అగ్ని సత్తయ్య, బుగ్గ రాజు,  రవి, మండల సంయుక్త కార్యదర్శి జంజిరాల  తిరుపతి, లంక రాకేష్,కాసిపేట మండల అధ్యక్షుడు దాడి పెంటయ్య,  దేవాపూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు మల్లేష్, సలహాదారు  గడ్డం పురుషోత్తం, కాం పెళ్లి వెంకటేష్, భానోత్ రాంచందర్, మేడ రామ్ చందర్, దాసరి రామచందర్   తదితరులు పాల్గొన్నారు.