కాసిపేట -2 గనిని
సందర్శించిన జిఎం సేఫ్టీ
జాన్ ఆనంద్.
![]() |
| కాసిపేట -2 గనిని సందర్శించిన కార్పోరేట్ సేఫ్టీ జిఎం జాన్ ఆనంద్ . |
![]() |
| జి ఎం సేఫ్టీ గా పదోన్నతి పొందిన జాన్ ఆనంద్ ను సన్మానిస్తున్న కాసిపేట - 2 గని అధికారులు. |
Scv News Kasipet :--
మందమర్రి ఏరియా కాసీపేట -2 గని లో ఈ రోజున సింగరేణి కార్పొరేట్ రక్షణాధి కారి జాన్ ఆనంద్ సందర్శించారు. గనిలో ని పని స్థలాలను తనిఖీ చేసారు. గనిలో పనిస్థలములో గాలి సరఫరా మరియు రూఫ్ / సైడ్స్ సపోర్ట్ పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు . తదనంతరం గని కార్యాలయం లో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ త్రైమాసిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేఫ్టీ కమిటీ సభ్యుల నుద్దేశించి జీఎం (సేఫ్టీ) జాన్ ఆనంద్ మాట్లాడుతూ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క ప్రాముఖ్యత ను వివరించారు. గనులలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, sop లు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణాధికారి ఓదెలు, కాసీపేట గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, గని మేనేజర్ మాటూరి రవీందర్, సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క ప్రాముఖ్యత ను వివరించి రక్షణపై తగు సూచనలు తెలియచేశారు.ఈ సందర్భంగా జీఎం సేఫ్టీ గా ప్రమోషన్ వచ్చినందుకు గాను జాన్ ఆనంద్ గారిని అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో గని రక్షణాధికారి E.సంతోష్ రావు, పిట్ ఇంజినీర్ B.రఘు, సంక్షేమ అధికారి భార్గవ్, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీ కారుకురి తిరుపతి, ఏ ఐ టి సి ఫుడ్ సెక్రెటరీ గొల్ల శ్రీనివాస్, ఇతర అధికారులు మరియు సుపర్ వైజర్లు పాల్గొన్నారు .

