మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సంక్షేమ గురుకుల పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వేముల కృష్ణ

  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

వేముల కృష్ణ విద్యాశాఖ

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి

వినతి పత్రం అందజేత.

 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ వినతిపత్రం అందజేత.

Scv News Kasipet :--

 కాసిపేట మండలం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలుర పాఠశాల భవ నానికి నిధులు మంజూరు చేయాలని, మోడల్ పాఠశాల ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు మండల పర్యటనకు వచ్చిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల కృష్ణ వినతి పత్రం లో  2016 లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 125వ జయం తిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  2016 లో నూతన గురుకులాలను ప్రకటించడం జరిగింద న్నారు.నూతనంగా ప్రకటించిన తెలం గాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాలను కాసిపేట మండ లానికి కేటాయించడం జరిగిందని 2016-2017 విద్యా సంవత్సరానికి గాను 13 జూన్ 2016 లో బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో  కాసిపేట, మంచిర్యాల పాఠశాల లను బెల్లంపల్లి, మంచిర్యాల శాసన సభ్యులు ప్రారంభించారని గుర్తు చేశా రు.

కొద్దీ రోజులకు బెల్లంపల్లిలో ప్రవేట్ భవనంలోకి మార్చారని అప్పటి నుండి ప్రైవేటు భవనంలోనే బెల్లంపల్లిలో కొనసాగుతుందని నేటికీ పాఠశాలను కాసిపేట మండల కేంద్రానికి తరలించ లేకపోయారన్నారు. గతంలో పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని సేకరించి మొదటి విడతలో నిధులు కేటాయించేందుకు చర్యలు చేపట్టిన నిధులు విడుదల మాత్రం కాలేదు.ప్రజల చిరకాల కోరిక రీత్యా,ప్రజల అవసరాల మేరకు, కాసిపేట మండలంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేసి, నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయాలని కాసిపేట మండల ప్రజల పక్షాన కోరుతున్నమని తెలిపారు.

 మోడల్ పాఠశాల తాత్కాలిక ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ (మోడల్) పాఠశాలలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి నెల 5 వ తేదీన వేతనాలను అందించాలని రెగ్యులర్ టీచర్స్ కు సమానంగా పని చేస్తున్న వారికి సకాలంలో వేతనాలు అందడం లేదని వినతి పత్రం అందజేశారు. అలాగే పని గంటల ఆధారంగా పని చేసిన ఉపాధ్యాయుల PRC బకాయి ఉన్న వేతనాలను మనవతాదృక్పదం తో నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరారు.పాఠశాల లో HPT గా పనిచేస్తున్న వారిని CTR  ఉపాధ్యాయులుగా నియమించి, నాణ్యమైన విద్య అందించాలని తమరికి సవినయంగా  కాసిపేట మండల ప్రజల పక్షాన మనవి చేయుచున్నామని వినతిపత్రంలో కోరారు.

 వినతి పత్రం అందజేసిన వారిలో వేముల కృష్ణ తో పాటు  మండల కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు  సిద్దం తిరుపతి, ధర్మారావుపేట మల్కపల్లి ఎంపీటీసీలు పార్వతి మల్లేష్, మడావి భీమ్రావు        గోలేటి స్వామి యస్ సి సెల్ అధ్యక్షుడు    మైదం రమేష్,గాదం గట్టయ్య,జాడి శివ పాల్గొన్నారు.