మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఐటిడిఎ పిఓ పర్యటన.

 కాసిపేట మండలంలో ఐటిడిఎ పిఓ పర్యటన.

 దేవాపూర్ గ్రామంలో  gcc అక్రమ కట్టడాలను పరిశీలిస్తున్న ఏ    ఐ టి డి ఎ పి ఓ వరుణ్ రెడ్డి.


 దేవాపూర్ లో అక్రమ కట్టడాలను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి 

Scv News Kasipet :--

 కాసిపేట మండలంలోని దేవాపూర్ పెద్దాపూర్, గ్రామాలను రేగుల గూడెం దేవాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలను గ్రామాలను ఐటిడిఎ పిఓ వరుణ్ రెడ్డి ఈరోజు సందర్శించారు. దేవాపూర్ మేజర్ పంచాయతీలో జిసిసి భవనం చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను పరిశీలించాడు. అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దేవాపూర్  పరిసరాల ప్రాంతాల్లో వున్నా 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గిరిజన సంఘాల నాయకులు పిఓ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం భూమిలో ని అక్రమ కట్టడాలను తొలగించడానికి చర్యలు తీసుకుంటానని గిరిజన సంఘాల నాయకులకు హామీనిచ్చారు.తదనంతరం దేవాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి పాఠశాల అదనపు భవనాల నిర్మాణాన్ని పరిశీలించారు. తర్వాత పెద్దాపూర్ గ్రామాన్ని సందర్శించి కోలాంగూడెం గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రేగులగూడెం ఆశ్రమ పాఠశాలను సందర్శించి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు పనులు పరిశీలించారు. ఆశ్రమ పాఠశాల లోని విద్యార్థులు అల్పాహారం, పాలు సరి పోవడం లేదని పిఓ దృష్టికి తెచ్చారు. విద్యార్థులకు భోజనం సరిగా పెట్టాలని మెనూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాటించాలని పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు, వార్డెన్ లకు సూచించారు. మండలంలోని గిరిజనుల సమస్యలను తుడుందెబ్బ నాయకులు, ఆడె జంగు, అనంతరావు. కనకరాజు, నాయక్ పోడ్ సేవ సంఘం నాయకులు కొమ్ముల బాపు, గంజి రాజన్న తదితరులు పాల్గొన్నారు.