దంతాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది.
- దంత వైద్యురాలు మనీషా.
Scv News Kasipet:--
మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నిత్యం దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గుట్కాలు తినడం, పొగ తాగడానికి దూరంగా ఉండాలని దంత వైద్యురాలు మనీషా ప్రజలను కోరారు. కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ రోజు ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లా డారు.ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషించే దంతాల విషయంలో ప్రజలకు సరైన అవగాహన లేక అనారోగ్యాలకు గురవుతున్నా రన్నారు. ముఖ్యంగా యువత గుట్కాలు తినడం వల్ల గొంతు క్యాన్సర్లకు గురవుతున్నారని, సిగరెట్ తాగడం వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ లకు గురై బాధపడుతూ చిన్న వయసు లోనే మరణిస్తున్నారన్నారు .ఆరోగ్యాని కి ప్రమాదకరంగా పరిణమించే గుట్కా లను సిగరెట్లు తాగడం మానుకోవాల ని కోరారు. పళ్ళను నిత్యం శుభ్రం చేసుకోవాలని లేకుంటే పళ్ళు పుచ్చి పోవడం వల్ల పిప్పళ్ళు వచ్చి ఇబ్బంది పెడతాయ న్నారు. చిన్న పిల్లలు ఆరు నెలల వయస్సు నుండి పళ్ళు రావడం ప్రారంభమవుతాయని తగు జాగ్రత్తలు తీసుకోకపోతే పళ్ళు నొప్పులు చిగుళ్ల నొప్పులు ప్రారంభమవుతాయన్నారు. నొప్పి చిన్నగా ఉన్నప్పుడే దంత వైద్యుల ను సంప్రదిస్తే కావలసిన ట్రీట్మెంట్ లు సిమెంట్ వేయడం, క్యాపులు వేయడం లాంటివి వేసి దంత సమస్యలు తీరుస్తారన్నారు. ఆలస్యం చేస్తే పళ్ళు పుచ్చిపోతే తీయాల్సి వస్తుందన్నారు. మారుమూల గ్రామాలలో ప్రజలకు దంత సమస్యలపై అవగాహన కల్పించేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.వైద్యశిబిరంలో దంత పరీక్షలు నిర్వహించి మందు లు ఉచితంగానే ఇస్తున్నామన్నారు. వైద్య శిబిరానికి హాజరైన వ్యాధి గ్రస్తులకు మంచిర్యాలలోని మనిషా సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలలో కొంత రుసుము తగ్గించి చికిత్సలు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని కాసిపేట మండల వాసులు ఉపయోగించుకోవాలని కోరారు.

