మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుంది.

 పేదల సంక్షేమమే ధ్యేయంగా

కేసీఆర్ ప్రభుత్వం

పనిచేస్తుంది.

-- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 కాసిపేట మండలం ధర్మారావు పేట రైతు వేదిక లో నూతన పింఛన్లు పంచేందుకు వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు స్వాగతం పలుకుతున్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి,  మహిళ సర్పంచులు.

 ధర్మారావు పేట రైతు వేదికలో నూతన పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.



Scv News Kasipet :--

 తెలంగాణ రాష్ట్రంలో  పేదల సంక్షేమం  కోసం కెసిఆర్ ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని బెల్లంపల్లి  నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఈరోజు ధర్మారావుపేట రైతు వేదిక లో ధర్మారావుపేట,మల్కపల్లి, కోనూరు, రొట్టెపల్లి ,కొండాపూర్ పంచాయతీ పరిధిలోని గ్రామాలలోని కొత్త ఆసరా పెన్షన్ దారులకు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భం గా ఆసరా లబ్ధిదారుల నుద్దేశించి  మాట్లాడుతూ పేద ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేందుకు గత ఎనిమిదేళ్లుగా ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు  లాంటి పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువు లకు,వికలాంగులకు, ఒంటరి మహిళలకు రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నా ప్రభుత్వం కెసిఆర్ దే నన్నారు.  దేశ ప్రధానమంత్రి మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో కూడా వృద్ధుల పింఛన్ 750 రూపాయలు ఉన్నాయని గుర్తు చేశారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 75 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చే వారన్నారు. ఈరోజు తెలంగాణలో 30 లక్షల పింఛన్లు ఇస్తున్నామని ప్రతి ఇంటి లో ఒకరికి అందుతున్నాయని అన్నారు.  ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం రెండు నుండి మూడు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల పేదల పింఛన్ల కోసమే ఖర్చు చేస్తుందన్నారు. పింఛన్ తీసుకునే వారంతా  కెసిఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ప్రజా సంక్షే మం కోసం పనిచేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని బిజెపి కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. 

ఎన్నికల సమయం రాగానే కొంతమంది బడా పెట్టుబడిదారులు ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా నని ఆశలు పెడుతున్నారని అతని మాటలు నమ్మవద్దని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపి స్తే పింఛన్లు రెండు వేల నుండి మూడు వేలకు పెంచుతాడు కాబట్టి మళ్లీ గెలి పించాలని పింఛనుదారులను  కోరారు.





ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల శాఖ అధ్యక్షులు దుర్గం పోశం మాట్లాడుతూ వృద్ధులకు 2000 పింఛన్ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఆనందంగా బతుకుతున్నారన్నారు.  మండల వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రావు మాట్లాడుతు తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఆదరాభి మానాలు పొందుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కొంతమంది విమర్శించడం సరైంది కాదన్నారు.  కోనూరు సర్పంచి అప్పని స్వరూప మాట్లాడుతు తమ గ్రామంలో కొంత మందికి పింఛన్లు వచ్చాయని మిగతా వారందరికీ కూడా ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు.

 ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంఏ అలీ, సింగిల్విండో చైర్మన్ బానోతు లీల, వైస్ చైర్మన్ తాటిపాముల శంకరయ్య, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మంజుల రెడ్డి, వాసుదేవ్, మల్కపల్లి సర్పంచి లక్ష్మి, కొండాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, తాటిగూడ సర్పంచ్ ముత్యాల పద్మ రొట్టపల్లి సర్పంచ్ లక్ష్మి హనుమం తు, పల్లం గూడెం ఎంపీటీసీ చంద్రమౌళి, మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తయ్య, మాజీ ఎంపీపీ సిడంజంగు  మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణు, ధర్మారావు పేట గ్రామ కమిటీ అధ్యక్షులు బాణాల సత్యనారాయణ, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.