మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

చిన్న ధర్మారం బ్రిడ్జి పై గుంతలు పూడ్చాలని బిజెపి నాయకుల డిమాండ్

 చిన్న ధర్మారం బ్రిడ్జి పై గుంతలు పూడ్చాలని  బిజెపి నాయకుల డిమాండ్ 

 చిన్న ధర్మారం బ్రిడ్జి గుంతలను పరిశీలిస్తున్న బిజెపి నాయకులు.

 గుంతల మయంగా మారిన చిన్న ధర్మారం బ్రిడ్జి దృశ్యాలు.

Scv News Kasipet:---

 కాసిపేట మండలంలోని చిన్న ధర్మారం బ్రిడ్జికి గుంతలు పడి ద్విచక్ర వాహన దారులు  ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతు న్నారని బిజెపి నాయకులు మండల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు చిన్న ధర్మారం బ్రిడ్జి వద్దకు వచ్చి గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి పై గుంతల విషయమై  స్థానిక సర్పంచి కి ఎన్నోసార్లు  చెప్పిన కూడా పట్టించు కోవడం లేదని తెలిపారు.బ్రిడ్జికి ఇరు వైపులా పిల్లర్స్ లేక కురుస్తున్న వర్షాల కు బ్రిడ్జి పైన బురద ఏర్పడి. ప్రజలు బ్రిడ్జి పైన వెళ్లాలంటే భయపడుతున్నా రన్నారు. వాహనదారులు  బ్రిడ్జి పైన బురదకు బైకులు జారివాగులో పడే అవకాశం ఉందని భయపడుతున్నార న్నారు. స్థానిక ఎంపీడీవో గారికి రెండు నెలల కింద వినతిపత్రం ఇచ్చిన ఎలాం టి స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్ స్పందించి త్వరగా మరమ్మతులు చేయించాలని భారతీ య జనతా పార్టీ తరపున మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని యెడల  బ్రిడ్జి పై గుంతల విషయమై  జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని  హెచ్చరిస్తు న్నామన్నారు.ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్. BJYM నాయకులు సూరం సంపత్  కుమార్. బర్ల శంకర్  నవీన్. బాకీ సురేష్. తులసి రామ్. రెడ్డి బాలరాజు. సిక్రం శ్రీనివాస్. ఎస్టీ మోర్చా మండల ప్రెసిడెంట్ గునువంతరావు. తదిత బిజెపి నాయకుడు పాల్గొన్నారు.