తెలంగాణ సాయుధ పోరాట
వీరనారి చాకలి ఐలమ్మ 128
వ జయంతి కార్యక్రమం.
![]() |
| రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలోకొండాపూర్ చౌరస్తా లో చాకలి అయిలమ్మ జయంతి ఉత్సవం |
Scv News Kasipet:--
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 128 వ జయంతి కార్యక్రమం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తా లో ఈరోజు రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంగం మండల శాఖ అ ఉపాధ్యక్షుడు సంఘపు పోచయ్య, ప్రధాన కార్యదర్శి చంద్రగిరి రమేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రాములు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మండల కమిటీ సభ్యులు అనుష లక్ష్మి ఓగుల లక్ష్మి, గురువయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
| మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జన్మ దినోత్సవ కార్యక్రమం. |
జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల నివాసి రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దావన పల్లి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పాయిదాల రాములు, చందర్ సంఘపు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

