బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం.
Scv News Kasipet :--
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కాసిపేట మండలంలోని ముత్యం పెళ్లి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్క రించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా మండల అధ్యక్షుల సమక్షంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటుక పురం రమేష్, బీజేవైఎం జిల్లా నాయకులు సూరం సంపత్ కుమార్ ముత్యం పెళ్లి బూతు అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నరేంద్ర మోడీ జన్మ దినోత్సవ సందర్భంగా రక్తదానం.
ప్రియతమ నేత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి నియోజక వర్గ భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో మహా రక్త దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కాసిపేట మండలం నుండి బిజెపి నాయకులు రక్త దానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ గారు జిల్లా కిసాన్మోర్చా ఉపాధ్యక్షులు రమేష్, బీజేవైఎం నాయకులు సూరం సంపత్ కుమార్, ప్రదీప్, నాగరాజు ,మహేష్,విష్ణు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
