మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల స్థల పత్రాల పంపిణీ.

 బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల స్థల  పత్రాల పంపిణీ. 

 ఈ సంఘాల ఆత్మ గౌరవ భవనాల స్థల పత్రాలను అందజేస్తున్న మంత్రులు  


Scv News Kasipet :--

రాష్ట్రంలో 11 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కేటాయించిన స్థల పత్రాలను గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 41 బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోకాపేట, ఉప్పల్‌ భగాయత్‌లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించింది. భవన నిర్మాణాలకు రూ.95.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఏక సంఘాలుగా ఏర్పడిన 24 బీసీ కుల సంఘాలకు స్థల కేటాయింపు కాపీని అందించారు. మరో 11 సంఘాలు సైతం ఇటీవల ఏకసంఘాలుగా ఏర్పాట య్యాయి. వాటికి  బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి చేతుల మీద గంగుల  కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్, శ్రీనివాస్ గౌడ్,  ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, చేతుల మీదుగా వాల్మీకి ఆత్మగౌరవ భవనం సంబంధించిన ప్రొసీడింగును అందుకోవడం జరిగినది  ఈ కార్యక్రమంలో ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు హరి శంకర్ నాయుడు, గొంధి వెంకటరమణ,  రేపల్లె కృష్ణ ,  విజయ్ కుమార్, కురుమన్న ,  మండ్ల వేణుగోపాల్  ,రామ్మూర్తి నాయుడు  , ఉంగ్లం తిరుమల్ , పెద్ద ముక్కుల రవి, ఎం కె మూర్తి ,నరేష్ నాయుడు , ev రమణ, బొగ్గు వెంకటేష్,నీల స్వామి, అయ్యన్న ,ఆశన్న, మరియు తెలంగాణ రాష్ట్ర వాల్మీకి ప్రజలు పాల్గొనడం జరిగినది తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారికి మరియు మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి గంగుల కమలాకర్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి బీసీ సంక్షేమ ఉన్నతాధికారులకు అందరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.