కాసిపేట మండలంలో
మహిళలకు బతుకమ్మ చీరల
పంపిణీ
![]() |
| మద్దిమడుగు పంచాయతీ లో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్న ఎంపిపి రోడ్డ లక్ష్మి సర్పంచ్ ఆడే జంగు. |
Scv News kasipeta:--
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు మండల ప్రజా ప్రతినిదులు, సర్పంచ్ లు తెరాస పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మద్దిమాడ, కొండాపూర్, ధర్మారావు పేట పంచాయతీలలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది.
మద్దిమాడ పంచాయతీ లో...
మద్దిమడ పంచాయతీ లో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, సర్పంచ్ ఆడే జంగు, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, మండల శాఖ అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్, నాయిని మల్లేష్ చేతులమీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భూనేని దివ్య, మారనేని శైలజ, బండారి వేణు, సెడ్మాకి జంగు, బొల్లు శ్రీనివాస్, రెడ్డి లక్ష్మణ్ మొగిలి లు పాల్గొన్నారు.
కొండాపూర్ పంచాయితీలో...
![]() |
| కొండాపూర్ పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి గ్రామ సర్పంచ్ మక్కల శ్రీనివాస్. |
కొండాపూర్ యాప పంచాయతీలో తెరాస మండల శాఖ అధ్యక్షుడు రమణారెడ్డి, సర్పంచ్ మక్కల శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, వార్డు సభ్యులు కొమిరె ముత్యాలు తెరాస నాయకులు సుధాకర్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షుడు రాజా గౌడ్, ఎంబడి కిషన్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు.
లంబాడి తండ డి గ్రామ పంచాయతీలో....
![]() |
| లంబాడి తండా డి పంచాయితీలో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ రోడ్డ లక్ష్మి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, సర్పంచి అజ్మీరా తిరుపతి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి |
లంబాడి తండా డి పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎంపీపీ రోడ్డ లక్ష్మి బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, గ్రామ సర్పంచ్ అజ్మీరా తిరుపతి, తెరాస పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమణారెడ్డి, మండల తెరాస నాయకుడు సుధాకర్ రెడ్డి, ధర్మారావుపేట తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు బాణాల సతీష్, పంచాయతీ తెరాస నాయకులు మంగ శ్రీకాంత్, సక్రియ నాయక్ చేతులమీదుగా చీరలు పంపిణీ చేశారు.


