మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుంది

 పేదల సంక్షేమమే ధ్యేయంగా

కేసీఆర్ ప్రభుత్వం

పనిచేస్తుంది.

  - ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 కాజీపేట పంచాయతీ లో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 దేవాపూర్ పంచాయితీలో కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.


ScvNews Kasipet:--

 తెలంగాణ రాష్ట్రంలో  పేదల సంక్షేమం కోసం కెసిఆర్ ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని బెల్లంపల్లి నియోజక వర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం కాసిపేట, దేవాపూర్ మేజర్ గ్రామ పంచాయతీల లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీ  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నా ప్రభుత్వం మనదే నన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 75 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చే వారన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  పింఛను 750 రూపాయ లు పెంచమని అధికారులు కెసిఆర్ కు సూచించా రన్నారు.ఆ డబ్బులతో పేదలకు ఏమి రాదని వారి కుటుంబాలకు ఆసరాగా ఉండాలంటే ₹2000 పింఛన్ ఇవ్వా ల్సిందేనని పట్టుబట్టి ఇప్పించారన్నారు. ఈ రోజు ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం రెండు నుండి మూడు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల పేదల పింఛన్ల కోసమే ఖర్చు చేస్తుందన్నారు. పింఛన్ తీసుకునే వారంతా  కెసిఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం పని చేసే కేసీఆర్ ప్రభుత్వా న్ని బిజెపి కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. 

జిల్లా అధికారి పిడి శేషాద్రి మాట్లాడు తూ రాష్ట్రప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 57 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం వల్ల పేద కుటుంబాలకు న్యాయం జరిగింద న్నారు.రాష్ట్రంలో కొత్తగా 9 లక్షల మందికి పింఛన్లు మంజూరు అయ్యా యన్నారు. పక్షపాతం లేకుండా అందరికీ ఇవ్వడం జరుగుతుంద న్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వడం జరిగిందని ఎవరికైనా రాకుంటే ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.పింఛన్లు  రాకపోవడానికి కారణాలు తెలుస్తా యన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి , జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, కాసిపేట సర్పంచ్ దేవి, ఎంపీటీసీ అక్కపల్లి  లక్ష్మి, మండల ఉపాధ్య క్షుడు విక్రమ్ రావు, దేవాపూర్ లో జరిగిన కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధు లతో పాటు  సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ మెరుగు పద్మ, అట్టపల్లి లక్ష్మి,మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.