కాసిపేట మండల కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ జయంతి.
Scv News Kasipet :--
నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యం రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త.. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కాసిపేట మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఘనంగా నిర్వహించింది. జాగృతి మండల శాఖ అధ్యక్షుడు సోదారి సురేష్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జాగృతి మండల అధికార ప్రతినిధి గంగాధరి రాజకుమార్, కోశాధికారి కనక వంశీకృష్ణ, కో కన్వీనర్ చిక్రమ్ రాందాస్, కార్యదర్శి అట్లా మల్లేష్, కాసిపేట జిపి అధ్యక్షులు దుర్గం శేఖర్, గేడం లక్ష్మణ్ లు పాల్గొన్నారు.
