మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా 75 వ స్వాతంత్ర అమృతోత్సవం కార్యక్రమాలు.

 కాసిపేట మండలంలో ఘనంగా 75 వ స్వాతంత్ర అమృతోత్సవం కార్యక్రమాలు.

 ధర్మ రావు పేట పంచాయితీలో లో 

 బుగ్గ గూడెం పంచాయితీలో లో 

 మద్దిమాడ పంచాయతీ లో 

 సోనాపూర్ పంచాయితీలో 



Scv News Kasipet:--

మంచిర్యాలజిల్లా కాసిపేట మండలంలో 75వ స్వాతంత్ర అమృతోత్సవ కార్యక్రమాలు శనివారం వివిధ గ్రామాలలో ఘనంగా జరిగాయి. తపాలశాఖ పోలీసులు, టిఆర్ఎస్, బిజెపి నాయకులు వివిధ గ్రామాల్లో జాతీయ జెండాలను  పంపిణీ చేశారు,గ్రామాలలో ప్రజలు తమ ఇళ్ళ మీద జాతీయ జండాను ఎగుర వేసుకున్నారు, దేవాపూర్, సోనాపూర్,మద్దిమాడ,పల్లంగూడెం, కొండాపూర్,ముత్యంపల్లి గ్రామాలలో స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు విద్యార్థులతో తిరంగా  ర్యాలీలు నిర్వహించారు.ముత్యం పల్లి గ్రామ పంచాయితీ ఆధ్వర్యం లో క్రీడామైదానంలో 75 వ స్వాతం త్ర ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులను 75 సంఖ్య ఆకారం లో నిలబెట్టి ప్రదర్శించి డ్రోన్ కెమెరా తో చిత్రీకరించడం మండలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముత్యం పల్లిలో గ్రామ సర్పంచ్ ఆడే బాదు, మండల వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రావు,ఉప సర్పంచ్ బోయిన బాపు, కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, ఎంపీడీవో ఎం ఏ అలీ, ధర్మ రావుపేట లో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, పల్లం గూడెం గ్రామంలో సర్పంచ్ విజయ చంద్, ఎంపీటీసీ చంద్రమౌళి, మద్దిమాడా లో సర్పంచి ఆడే జంగ్ తదితరులు పాల్గొన్నారు.


  * బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండా ల పంపిణి.


 కొండాపూర్ యాప దేవాపూర్ లో జాతీయ జెండాల పంపిణీ చేసిన బిజెపి నాయకులు.

కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప, కాసి పేట, ముత్యంపల్లి, దేవాపూర్ గ్రామాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా   మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్ కాపురం రమేష్ , మండల యువజన మోర్చా నాయకుడు సూరం సంపత్, మండల బిజెపి నాయకు లు పేరుగు రాజు, పెద్దపల్లి శంకర్ పోలవని పోశం, దేవునూర్ సంతూ, రామ్ చందర్  తది తరులు పాల్గొన్నారు.