కాసిపేట మండలం లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.
![]() |
| కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తా లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం. |
Scv News Kasipet :--
బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి కార్యక్రమం ఈరోజు కాసిపేట మండలంలోని కొండాపూర్ చౌరస్తాలో మోకుదెబ్బ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల మోకు దెబ్బ సభ్యులంతా హాజరయ్యారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి ధర్మారావుపేట్ సింగిల్విండో ఉపాధ్యక్షుడు తాటిపాముల శంకర్ గౌడ్ పూలమాల వేశారు. గ్రామ కమిటీ మండల శాఖ నాయకులు చిత్రపటం ముందు పూలను సమర్పించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ స్థలమంతా సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలన్నారు. మండలంలోని గౌడ సోదరుల మంతా ఐక మత్యంతో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ నేడు దేశంలో రాష్ట్రంలో బహుజన రాజ్యం రావాలని అంబేద్కర్ సంఘాలు బహుజన సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయన్నారు. కానీ 353 సంవత్సరాల క్రితం తెలంగాణలో బహుజన రాజ్యం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాధించిపెట్టాడన్నారు. తెలంగాణలో 22 కోటలను నిర్మించి 30 ఏళ్ళు పరిపాలించిన సర్వాయి పాపన్న చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఎక్కడ రాయబడ్డ లేదన్నారు. మనువాద బ్రాహ్మణ వర్గం చదువు తన చేతుల్లో ఉండడం వల్ల తమకు అనుకూలమైన చరిత్రనే వారురన్నారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం క్షత్రియుడు రాజ్యాన్ని పాలించాలని శూద్ర జాతికి చెందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, చత్రపతి శివాజీలను మనువాద బ్రాహ్మణులు రాజులు గా గుర్తించ లేదన్నారు. కనీసం బహుజన పోరాటయోధుల పరిపాలనను తెలిపే శిలా శాసనాలు చరిత్రను కూడా దేశంలో లేకుండా చేశారన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను బ్రిటిష్ వారి నుండి తెలుసుకోవాల్సి వచ్చింద న్నారు. పాపన్న చిత్రపటాన్ని లండన్ లోని మ్యూజియంలో భద్రపరిచిన పెయింటింగ్ ఆధారంగానే ఈరోజు తెలంగాణలో విగ్రహాలు పెట్టు కోవా ల్సిన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన గత 75 సంవత్సరా లుగా 15 శాతం ఉన్న అగ్రవర్ణాలు 85 శాతం ఉన్న బహుజనులను మందు విందుల తో ఓట్లను కొనుగోలు చేసి పరి పాలిస్తున్నారన్నారు. ఎన్నికల సమయాల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి గౌడ సోదరుల ఓట్లతో గెలిచి నాయకులు మర్చిపోతు న్నారు.బహుజన రాజ్యం వస్తానే మన సమస్యలు పరిష్కారం అవు తాయని బహుజన వర్గాలలోని అన్ని కులాలు ఐక్యమత్యంతో బహుజన రాజ్య స్థాపన కోసం పాటుపడాలన్నారు.
ఈ కార్యక్ర మంలో మోకు దెబ్బ మండల శాఖ అధ్యక్షుడు కోడూరు విద్యాసాగర్, మోకు దెబ్బమండల నాయకులు పడాల మల్లేష్ గౌడ్, పోడేటి రాజా గౌడ్, ప్రకాష్ గౌడ్, నేరెళ్ల నర్సింగ్ గౌడ్, మార్క శ్రీనివాస్ గౌడ్, బుర్ర లింగన్న గౌడ్, భూమ గౌడ్, సాయి చరణ్ గౌడ్ తో పాటు గ్రామ మోకు దెబ్బ నాయకులు పాల్గొన్నారు.
