సల్పాలవాగుకు పర్యాటక
శోభ ఎప్పుడు?
ఓరియంట్ యాజమాన్యం సి ఎస్ ఆర్ నిధులతో పర్యాటక అభివృద్ధి చేయాలని ఆదివాసి నాయకుల డిమాండ్.
- పర్యాటకాభివృద్ధి పట్టించుకోని తెరాస ప్రభుత్వం.
- హామీని నిలబెట్టుకోని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు.
- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యాట కాభివృద్ధికి నిధుల మంజూరు తో పాటు అటవీ శాఖ అనుమతికి కృషి చేయాలని మండల వాసుల విన్నపం.
![]() |
| చలవ రాళ్లపై వర్షపు నీరు జలపాతంలో ప్రవహిస్తు పర్యాటకులకు ఆకట్టుకుంటున్న సలపాలవాగు. |
![]() |
| సల్పలవాగు చలవ రాళ్ళపై విందులు చేసుకుంటూన్న ఉద్యోగులు. |
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ సమీపంలోని సల్పాలవాగు పర్యాటకులను విశేషంగా ఆకట్టు కుంటుంది.చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుండి వాగు ప్రవహిస్తుంది. ప్రకృతి సహజ సిద్ధంగా వందల మీటర్ల విస్తీర్ణంలో పెద్ద పెద్ద రాళ్ళు పొరలు పొరలుగా చూడముచ్చటగా ఉంటాయి. వర్షాకాలంలో సల్పల వాగులో నుండి వచ్చే నీరు బండల పొరల మీదుగా జలపాతంలా కిందికి పడుతూ పర్యాటకు లకు కనువిందులు చేస్తుంది. ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకిం చేందుకు మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంతాల నుండి ప్రజలు విశేషంగా తరలి వస్తుంటారు.ఇలాంటి పర్యాటక ప్రాంతాల ను అభివృద్ధి చేయడంలో పర్యాటక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కాసిపేట మండలం దేవాపూర్ అటవీ ప్రాంతంలో ఎడమవైపు సల్ఫల వాగు ప్రవహిస్తుంది. పడమటివైపు గడుపూర్ గుట్ట లతోపాటు సోనాపూర్ పంచాయతీ లోని ఘట్ రావుపల్లె,బుగ్గ గుట్టల నుండి వర్షపు నీరు రెండు వాగులుగా ప్రవహిస్తూ రాంపూర్ వద్ద కలిసి సల్పల వాగుగా అవతరించింది. వాగు ప్రవహించే ప్రదేశంలో వందల మీటర్ల విస్తీర్ణంలో సున్నపురాయి బండరాళ్ళు ఒకదానిపై ఒకటిగా పొరలు పొరలుగా ఉంటాయి. ఈ బండరాళ్లను సల్పాలుగా పిలుస్తుంటారు ఈ సల్పాల పేరు మీదనే వాగుకు సల్ఫల వాగు అనే పేరు వచ్చింది. వర్షాకాలంలో అభయారణ్యంలో కురిసిన వర్షం నీరు రెండు గుట్టల మధ్య నుంచి ప్రవహిస్తూ చలవ రాళ్ల నుంచి కిందికి జలపాతంలా పడుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మండు వేసవిలో వాగులో నీరు ఇంకిపోకుండా గుట్టలో నుంచి పెద్ద పెద్ద నీటి ఊటల ద్వారా నిరంతరం నీరు వాగులోకి ప్రవహిస్తుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకించేం దుకు ఆగస్టు నుంచి ఫిబ్రవరి నెల వరకు విద్యార్థులు విహారయాత్రలకు వస్తుంటా రు. సింగరేణి, ఓరియంట్ అధికారులు కార్మికులు వారి కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వచ్చి ప్రకృతి అందాలను వీక్షించి చలవ రాళ్లపై సేద తీర్చుకుంటారు.
సీతారామ్ మహారాజు గుడి నిర్మాణం తో సల్పలవాగుకు ఆధ్యాత్మిక శోభ .
![]() |
| రామాలయం నిర్మాణ కర్త సీతారామ్ మహారాజ్ |
![]() |
| రామాలయం నిర్వాహకుడు దేవాపూర్ మాజీ సర్పంచ్ కొడప ప్రేమ్ సాగర్ . |
దేవాపూర్ మాజీ సర్పంచ్ కొడప ప్రేమ్ సాగర్ తండ్రి సీతారామ్ మహారాజ్ పదిహేనేళ్ల క్రితం సొంత డబ్బులతో పాటు భక్తుల విరాళాలతో కోదండ రామాలయా న్ని నిర్మించారు. సీతా రామ్ మహారాజ్ స్పూర్తితో చింతగూడెం గ్రామానికి చెందిన మారుతి అనే ప్రభుత్వ ఉద్యోగి సొంత డబ్బులతో హనుమాన్ ఆలయం నిర్మించా డు. దీంతో సలపాల వాగుకు ఆధ్యాత్మిక శోభ వచ్చింది. రామాలయంలో ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు మాజీ సర్పంచ్ కొడప ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్భక్తులు మాలలు ధరిస్తారు. శ్రీరామ నవమి ఉత్సవంలో పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకల్లో పాల్గొంటారు. కార్తీక పౌర్ణమి రోజు గిరిజనులు ఉసిరిక పూజలు, జాగరణలు, వన భోజనాలతో పాటు రాత్రంతా భజనలు పూజలు చేస్తూ గడుపుతుంటారు. తిర్యాని, కాసిపేట మండలంలోని గోండు కొలాం తెగ గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే గజాల దేవుడు, భీమన్న ఆలయం,పెద్ద దేవర మడుగు కూడా సలపాల వాగు లోనే ఉంది. వేసవి కాలంలో గిరిజనులు ఎడ్లబండ్లతో సల్ఫల వాగుకు వచ్చి రెండు రోజులు ఇక్కడే ఉండి మొక్కులు తీర్చుకుంటారు. గత ఐదు సంవత్సరాలు గా గిరిజన పోరాట హక్కుల సంఘం తుడుందెబ్బ ఆధ్వర్యంలో దీపావళి పండుగకు ముందు గుస్సాడి దండారి ఉత్సవాలను సల్పల వాగులో పెద్ద ఎత్తున నిర్వహిస్తు న్నారు.
![]() |
| సల్పల వాగులో గుస్సాడి నృత్యాలు. |
గత మూడు దశాబ్దాలుగా పరిసర ప్రాంత ప్రజలను విశేషం గా ఆకట్టు కుంటున్న సల్పలా వాగు ను పర్యాటక కేంద్రంలో కనీస సదుపాయాలు కల్పించడం లో ప్రజా ప్రతినిధులు పర్యాటక శాఖ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని స్థానికులు విమర్శిస్తు న్నారు.
పర్యాటక అభివృద్దిని పట్టించుకోని ఓరియంట్ యాజమాన్యం.
సలపాలవాగు పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి పరచడంలో ఓరియంట్ యాజమాన్యం పట్టించు కోవడంలేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా కంపెనీ లాభాలలో వాటాకింద పరిసర గ్రామాల అభివృద్ధి, పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు (csr) కేటాయిస్తుంది. ఈ నిధులు పరిసర గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయకుండా వేరే జిల్లాలలో సీఎస్ఆర్ నిధులు వ్యయం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. సలపాలవాగు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కోసం అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదనే ఓరియంట్ యాజమాన్యం సాకులు చూపుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధు లు అటవీశాఖ నుండి అనుమతులు తీసుకువచ్చి ఓరియంట్ యాజమాన్యం నుండి పర్యాటక కేంద్రం అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేయించా లని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న పట్టించుకునే వారులేరు.
అమలు కాని కాంగ్రెస్, తెరాస ప్రభుత్వాల హామీలు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన మండల వాసి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు సల్ఫల వాగును పర్యాటక శాఖచే అభివృద్ధి చేయిస్తానని ఇచ్చిన హామీ నెరవేరలేదు.తాను టిటిడి సభ్యుడిగా ఉన్న సమయంలో దేవాపూర్ వచ్చిన ప్పుడు సల్ఫల వాగులో అటవీశాఖ అనుమతితో టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయం నిర్మించి అభివృద్ధి చేస్తానని హామీ కలగానే మిగిలింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఎనిమి దేళ్లుగా అమలు కావడం లేదు. గత రెండు పర్యాయాల ఎన్నికల్లో స్థానిక నాయకులు సలపాలవాగు పర్యాటక కేంద్రా అభివృద్ధి పరుస్తాం అని ఇచ్చిన హామీలు తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తెరాస ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధికి 5 లక్షల నిధులను కేటాయించింది.
ఇటీవల మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు సలపాలవాగు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు వినతి పత్రాన్ని అందజేశారు.
సల్పల వాగు పర్యాటక కేంద్రానికి తక్షణం కావలసిన అవసరాలు.
* పర్యాటకులు విడిది చేసేందుకు అవసరమైన కుటీరాలు ఏర్పాటు చేయాలి.
* కల్పన వాగు ఒడ్డున కూర్చుని అడవి అందాలను తిలకించేందుకు అవసరమైన బెంచీలు ఏర్పాటు చేయాలి.
* చిన్నపిల్లలు ఆడుకునే ఎందుకు ఉయ్యాలలు జారుడు బల్లలు ఏర్పాటు చేయాలి.
* వాగు ఒడ్డున పూలతోట పార్కు అభివృద్ధి చేయాలి.
* రామాలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు పర్యాటకులకు తాగునీటి వసతి కల్పించాలి.ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించు కునేందుకు హాలు నిర్మించాలి.
స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో అటవీ శాఖ నుండి అనుమతులు తీసుకువచ్చి ఓరియంట్ యాజమాన్యం సి ఎస్ ఆర్ మినరల్ ఫండ్ తో కల్పన వారు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని మండల వాసులు కోరుతున్నారు.
సల్పలవాగు పర్యాటక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి .
ఆడే జంగు, మద్దిమడ సర్పంచ్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి.
సల్పల వాగు లో ప్రతియేటా మండల గిరిజనులు దండారి దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని గిరిజనుల ఆరాధ్య దైవం గజాల భీమన్న దేవాలయం, పెద్ద దేవర మడుగు ప్రాంతంలో పూజలు చేస్తుంటా రన్నారు. సల్పల వాగు ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓరియంట్ యజమాన్యం అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన అటవీశాఖ అనుమతులు లేక పనులు చేయడం లేదు. పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం అటవీశాఖ అనుమతులు ఇప్పించాలి. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా అభివృద్ధి సల్పలవాగు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని తెరాస ప్రభుత్వాన్ని కోరారు.
మంచిర్యాల జిల్లా వాసులను ఆకర్షిస్తున్న సల్పలవాగు పర్యాటక కేంద్రం.
- కొమ్ముల బాపు, నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి, సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి.
మంచిర్యాల జిల్లా ప్రజలను సలపాలవాగు పర్యాటక కేంద్రం ఎంతో ఆకర్షిస్తుంద న్నారు. దట్టమైన అడవి రెండు గుట్టల మధ్యలో నుండి సల్పల మీది నుండి వాగు నీరు వహిస్తుండడం పకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటుం దన్నారు. సలపాలవాగు అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పర్చలి.









