మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గిరిజన నాయకుడు రోడ్డ చిన్న రమేష్ ద్వితీయ వర్ధంతి

ఘనంగా 

ఆదివాసీ నాయక్ పోడ్

మండల నాయకుడు

అమరుడు రోడ్డ చిన్న రమేష్

ద్వితీయ  వర్ధంతి.


 అమరుడు రోడ్డ చిన్న రమేష్ కు నివాళులర్పిస్తున్న
నాయకపోడ్  సేవా సంఘం నాయకులు.


 అమరుడు రోడ్డ చిన్న రమేష్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎంపిపి రోడ్డ లక్ష్మి కుటుంబ సభ్యులు.




 అమ్మ రోడ్డు రోడ్డు చిన్న రమేష్ విగ్రహానికి పూల మాల వేస్తున్న నాయక్ పోడ్సే వా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేశినేని  రాజన్న రాష్ట్ర,జిల్లా నాయకులు 





Scv News Kasipet :--

మంచిర్యాల జిల్లా కాసిపేట  మండలం దేవాపూర్ నాయకపు గూడ గ్రామంలో  మంగళవారం అమరుడు  ఆదివాసి నాయక్ పోడ్ సేవ సంఘం మండల నాయకుడు రొడ్డ చిన్న రమేష్  రెండవ వర్ధంతి  కార్యక్రమం నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయక్ పోడ్ సాంప్రదాయక పద్ధతిలో డబ్బులతో ఇంటినుండి ఊరేగింపు గా సమీపంలోని తన వ్యవసాయ భూమిలో నెలకొల్పిన చిన్న రమేష్  విగ్రహం వద్ద కు వెళ్లారు. పూజా కార్యక్రమం నిర్వహించి జెండా ఆవిష్కరణ చేసి నివాళు లర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా,వారి కుటుంబ సభ్యులు,  ఎంపీపీరోడ్డ లక్ష్మి గారు, ఆదివాసి నాయకపొడ్ సేవ సంఘం రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండలనాయకులు, మరియు సామాజిక చైతన్య వేదిక నాయకులు, మహిళలు, అందరూ కూడా నివాళులు అర్పించి తదుపరి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా   ఆదివాసి నాయక పోడ్ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేసిన్నేని రాజయ్య,  ఉపాధ్యక్షులు గంజి రాజన్న , కోశాధికారి కొమ్ముల భాపన్న , సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహాదారులు చిన్న బీమయ్యలు గిరిజన హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో, ఉద్యమా లలో ఏలా చురుగ్గాపాల్గొనే వాడో గుర్తు చేసుకున్నారు.తుడుం దెబ్బ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సోయం జంగు , నాయక పొడ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తట్ర భీమ్ రావ్ ,మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు భీమిని మహేందర్ గారు, కల్చరర్ సెక్రెటరీ,రెడ్డి లక్ష్మణ్ గారు, తుడుందేబ్బ జిల్లా నాయకు లు కనక రాజు ,మండల అధ్యక్షు లు ఆత్రం జంగులు చిన్న రమేష్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, అతను  స్థానిక గిరిజనులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకపొడ్ సంఘం దేవాపుర్ గ్రామ అధ్యక్షు లు గడ్డం భీమయ్య , సోనాపుర్ గ్రామ అధ్యక్షులు రోడ్డ భీమ్ శేన్ , వార్డు సభ్యులు గడ్డం శిరీష తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి నాయకుడు సేవా సంఘం మండల శాఖ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అధ్యక్షత వహించాడు. సమావేశానికి ముందు  చిన్న రమేష్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు.