మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధా

 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  జయంతి.


 కాసిపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ 
 విగ్రహానికి పూలమాల వేస్తున్న  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ.


 

Scv News Kasipet :--

 కాసిపేట మండల  కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈరోజు  మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో భారత రత్న భారత దేశ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ  78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వ హించా రు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సంధర్భంగా కార్యక్రమ నుద్దేశించి వేముల కృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోనే  అతి చిన్న 40 సం.రాల వయసులోనే 6వ దేశ ప్రధానిగా పదవి చేపట్టి  దేశాన్ని సమూల మైన మార్పులతో భవిష్యత్ తరాన్ని దృష్టి లో పెట్టుకుని వారి ఆలోచనలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో  విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడాన్నారు.ఈరోజు దేశం డిజిటలైజేషన్ తో వెలిగి పోతుందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ అని అన్నారు. రాజకీయాల్లో యువత పాత్ర కచ్చితంగా ఉండాలని యువతే దేశానికి వెన్నుముక అని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించారని మరియు బ్యాంకుల ను జాతీయకరణ లాంటి గొప్ప గొప్ప సంస్కరణలు చేసారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి,మల్కేపల్లి యంపిటిసి భీంరావు,మాజి సర్పంచ్ లు అప్పని ప్రభాకర్,జాడి శంకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు రత్నం ప్రదీప్,ఉప సర్పంచులు కనుకుల రాకేష్,ఆరెపెళ్లి ప్రవీణ్ లు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కన్నక రాజు,గోలేటి స్వామి,మైధం రమేష్,అన్నం కుమార్,కొత్త రమేష్,,గాధం గట్టయ్య,దూడ మహేష్,మల్లేత్తుల రాజేశం,నస్ఫురి నర్సింగ్, పుర్రె పోషం,విద్యా సాగర్,బానోతు రవి,రాజు కుమార్, చిలుముల విష్ణు,ప్రేమ్ ,ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.