మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు గ్రామాల్లో పాదయాత్ర.

 స్వాతంత్ర వజ్రోత్సవాల

సందర్భంగా ప్రేమ్ సాగర్రా

వు గ్రామాల్లో పాదయాత్ర.

 పెద్దనపల్లి గ్రామంలో పాదయాత్ర చేస్తున్న ప్రేమ్సాగర్ రావ

Scv News Kasipet:--

స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసిసి ఆదేశాల మేరకు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ లు మంచిర్యాల జిల్లాలోని వివిధ గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ పోరాటలతోనే దేశానికి స్వాతంత్ర్యం లభించినదని ప్రజలకు తెలియ పరుచటకు దేశ వ్యాప్త 'ఆజాది క గౌరవ్ యాత్ర 'ను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలో 75 కిలో మీటర్ల పాదయాత్రలో భాగంగా  ఈరోజు బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయం నుండి పెద్దనపల్లి  మరియు లంబడితండా కె,సోమగుడెం కె గ్రామ పంచాయతీల మీదుగా పాదయాత్ర చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోరాటాలతోనే స్వతంత్రం వచ్చిందని కానీ ఈనాడు దేశంలో పదవిలో ఉన్న మతతత్వ బీజేపీ మరియు రాష్ట్రంలో ఉన్న నిరంకుశ టీఆరెస్ పార్టీలు తాము ఏదో చేసినట్టుగా హడావిడి చేసి ప్రజలను త్రప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో  కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ,మాజీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ఎంపిటిసిలు పార్వతి మల్లేష్,భీంరావ్,ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,నాయకులు గాధం గట్టయ్య,గోలేటి స్వామి ,మైధం రమేష్,కొత్త రమేష్,పంబాల తిరుపతి,జాడి శంకర్,ఆనంద చారి,దాగం లింగయ్య, బుక్య కిరణ్,అక్కపల్లి సాయి మరియు తదితరులు పాల్గొన్నారు