రాజస్థాన్ సంఘటనకు నిరసనగా కాసిపేట మండలంలో పాఠశాలల బంద్.
![]() |
| కార్మెల్ గిరి పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. |
![]() |
| దేవాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తరగతుల బహిష్కరించిన విద్యార్థులు. |
Scv News Kasipet :--
రాజస్థాన్ రాష్ట్రంలో ఇంద్ర కుమార్ మేక్ వాల్ అనే మూడవ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయులకు కేటాయించిన కుండలో నీళ్లు తాగడం కారణంగా కొట్టి చంపిన ఉపాధ్యాయిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో బందులో పాల్గొన్నాయి. పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. దేవాపూర్ కార్మెల్ గిరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు గసికంటి మల్లేష్, అటకపురం రమేష్ .మూసి వేయించారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్చార్జి కలవల శరత్ మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకల వజ్రోత్సవాల 75 స్వతంత్రంలో దేశాన్ని మొత్తం కూడా భాగస్వాములు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ రాష్ట్రంలో ఆగస్టు 14 తారీకున జరిగిన దళిత విద్యార్థి బాలుడి హత్యను ఖండిం చకపోవడం దారుణమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థి హత్య పై కనీసం స్పందించక పోవడం అంటే మోడీకి దళితులపై చిత్తశుద్ధి స్పష్టంగా అర్థం అవుతుందని విమర్శించారు. విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలి, విద్యార్థి కుటుంబాని కి రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మహాజన సోషలిస్టు పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి వినయ్ ఎమ్మార్పీఎస్ నాయకులు గసికంటి మల్లేష్, అంబేద్కర్ సంఘం నాయకులు రాజేష్ వెంకటేష్ లో పాల్గొన్నారు.

