పదవి విరమణ పొందిన
కార్మికుడికి ఘన సన్మానం.
![]() |
| పదవి విరమణ పొందుతున్న నాగయ్యను సన్మానిస్తున్న గని మేనేజర్ రవీందర్. |
![]() |
| పదవి విరమణ పొందిన నాగయ్య దంపతుల తో గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు. |
Scv News Kasipet :--
మందమరి ఏరియా కాసిపేట -2 గనిలో లైన్ మెన్ గా పని చేసి పదవీ విరమణ పొందిన నాగయ్య దంపతులను ఈరోజు గని ఆవరణలో గని అధికారులు,తోటీ కార్మికులు ఘనంగా సన్మానించారు. సింగరేణి కంపెనీ లో నాగయ్య 34 సంవత్సరాలుగా విధులు నిర్వర్తించా డు. పదవి విరమణ సందర్భంగా కంపెనీ తరఫున ఇచ్చే బహుమతిని గని మేనేజర్ మాటూరి రవీందర్ అందజేసి శాలువాతో సన్మానించారు.గని రక్షణాధికారి సంతోష్ రావు స్వీట్లు అందజేశారు. ఏరియా గుర్తింపు కార్మిక సంఘం ఏ ఐ టి యు సి తరుపున పులి శంకర్, కేంద్ర గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ తరపున ఫిట్ సెక్రెటరీ కారుకూరి తిరుపతి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పులి శంకర్, కారుకు తిరుపతి నాగయ్య కంపెనీకి చేసిన సేవల గురించి వివరించారు,తరువాత తోటి కార్మికులు, కుటుంబ సభ్యు లు పూలమాలలు శాలువాలతో నాగయ్య దంపతులను సన్మానించా రు.ఈ సందర్భంగా గని మేనేజర్ మాటూరి రవీందర్ మాట్లాడు తూ నాగయ్య చాలా మంచి వ్యక్తని కంపెనీ సూచించిన పనిని నమ్మకంగా చేసే నైపుణ్యం గల వ్యక్తని అన్నారు. దృఢమైన వ్యక్తి అని ముగ్గురు చేసే పని ఒక్కరే చేసే వారని కొనియాడారు. కంపెనీలో 34 సంవ త్సరాలు సర్వీస్ చేయడం గొప్ప విషయం అన్నారు. నాగయ్య సేవలను కంపెనీ కోల్పోవడం ఎంతో బాధాకరం అన్నారు. పదవి విరమణ అనంతరం వచ్చిన డబ్బులను సక్రమంగా వినియో గించుకోవాలని సూచించారు. గనిలో ప్రమాదాలు మందమరి ఏరియాలో మన గని లోనే ఎక్కువ జరుగుతున్నందున కార్మికులంతా రక్షణ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. యువ కార్మికులు నిరంతరం అప్రమత్తత తో ఉండి రక్షణతో కూడిన ఉత్పత్తి చేసేందుకు సహకరించా లని కోరారు. పదవి విరమణ పొందు తున్న నాగయ్య మాట్లాడుతూ సింగరేణి లో ఉద్యోగం చేరడం వల్ల నాకు ఎంతో మేలు జరిగిందన్నారు.చాలా పేదరికంలో ఉన్న మేము తినడానికి తిండి లేక చేసేందుకు పని లేక ఆకలితో అలమటించే వారమన్నారు. కంపెనీ పుణ్యాన తన కుటుంబాన్ని పిల్లలను మంచిగా చదివిం చుకుని పెళ్లిళ్లు చేశానని కంపెనీకి, మైసమ్మ తల్లికి రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గని ఇంజనీరు రఘు, సీనియర్ అండర్ మేనేజర్ నాగేశ్వరరావు, హెడ్ ఓవర్ మెన్లు నయీమ్ ఉద్దీన్, సుభాష్ చంద్రబోస్, హమీద్ గని సూపర్వై జర్లు కార్మికులు పాల్గొన్నా రు.

