- భూములు ఓరియంట్ ఆదీనంలో ఉన్నాయని జిల్లా సర్వే అధికారులు నిర్ధారించి పంచనామా రిపోర్ట్ ఇచ్చిన పట్టించుకోని యాజమాన్యం.
-- పంచనామ రిపోర్టుతో హైకోర్టును ఆ శ్రయించిన బాధితులు.ఉద్యోగాలు పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన అమలు కాని వైనం.
- జాక్వెల్ భూనిర్వాసితులకు లోడింగ్ ఉద్యోగాలు ఇచ్చిన, చట్టప్రకారం పర్మినెంట్ ఉద్యోగాలు కావాలని 37ఏళ్లుగా ఓరియంట్ యాజమాన్యంపై ఆ విశ్రాంతి పోరాటం చేస్తున్న కురిసింగా భీమ్, సోము వారసుల దీన గాధ గురించి..
![]() |
| పర్మినెంటు ఉద్యోగము పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ప్రతులను చూపిస్తున్న భీమ్ వారసులు |
![]() |
| పర్మినెంటు ఉద్యోగం పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ప్రతులను చూపుతున్నారు సోము వారసులు. |
| Scv News Kasipet :-- |
ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో నీటి అవసరాల కోసం రాంపూర్ గ్రామ సమీపంలోని పెద్ద వాగులో జాక్వాల్ బావులను గిరిజనుల పట్టా భూముల్లో యాజమాన్యం తవ్వుకుంది. నిర్వాసిత రైతు కుటుంబాలకు పర్మినెంటు ఉద్యోగంకు బదులు తాత్కాలిక లోడింగ్ ఉద్యోగం ఇచ్చి మోసం చేసింది. భూసేకరణ నిబంధనల ప్రకారం భూములు కోల్పోయిన నిర్వాసితులకు పర్మినెంటు ఉద్యోగం ఇవ్వాల్సిందేనని లోడింగ్ ఉద్యోగాలలో చేరకుండా కురు సింగా సోము, భీము వారసులు గత 37 సంవత్సరాలుగా ఓరియంట్ యాజమాన్యంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. భూములు కోల్పోయిన పట్టాదారులు చనిపోయారు. వారి కొడుకులు కూడా కొందరు చనిపోయారు. మరి కొందరు వృద్ధాప్యంలో పనిచేయలేక ఉన్నారు . పట్టేదారుల వారసులు మూడవ తరం వారి మనుమలు, మనుమరాళ్ళు తమకు న్యాయం చేయాలని ఓరియంట్ యాజమాన్యంపై ప్రస్తుతం పోరాడుతున్నారు. కోల్పోయిన భూములకు చాలన్ కట్టి జిల్లా సర్వే అధికారులతో కొలిపించారు.సర్వే అధికారులు ఓరియంట్ ఆధీనంలోనే మీ భూమి ఉందని నిర్ధారించారు . పంచనామా ధ్రువపత్రంతో హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు అప్ప చెబుతూ హైకోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పు అమలు చేయించడంలో జిల్లా కలెక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని గత 37ఏళ్లుగా ఆదివాసి కుటుంబాలు చేసేందుకు పని లేక ఆకలితో అలమటిస్తూ ఆ విశ్రాంతి పోరాటం చేస్తున్నారు...
దేవపూర్ పంచాయతీ పరిధిలో రాంపూర్ గ్రామానికి చెందిన కురిసింగా భీమ్, సోము ఇద్దరు అన్నదమ్ములు. వీరికి వేరువేరు సర్వే నెంబర్లలో నాలుగు ఎకరాల భూమివుంది. కురిసింగా భీమ్ కు సర్వే నెంబర్ 84 / 2/ 34 లో 1.10 ఎకరాలు, కురిసింగా సొము కు అతని భార్య జంగు బాయి పేరు మీద సర్వే నెంబర్ 84 /2/21 లో 2.27 ఎకరాల పట్టా భూమి ఉంది. 1985 సంవత్సరంలో ఈ భూమి పెద్దవాగు దక్షిణ భాగంలో ఉన్న జాక్వెల్ బావిలో, కొంత రైల్వే ట్రాక్ లో పోయింది.
కోల్పోయిన భూమి కింద ఉద్యోగము పరిహారం చెల్లించాలని పట్టాదారులు కురు సింగా భీము, సూరు ఓరియంట్ యాజమాన్యం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వృద్ధాప్యంతో మృతి చెందారు. వారి తర్వాత వారసులు భీమ్ కొడుకు బల్లార్షా, సూరు భార్య జంగు బాయిలు కూడ ఆనారోగ్యంతో మృతిచెందారు. సురు కు ఇద్దరు కొడుకులు వెంకట్రావు, బొజ్జురావు లు. భీమ్ మూడవ తరం వారసులు కురు సింగా రమ్య, ద్రౌపతి భాయి శ్రీకాంత్ లు, సోము వారసులు పెద్ద కొడుకు వెంకట్రావు వేరే సర్వే నెంబర్లు భూమి పోవడంతో ఉద్యోగం వచ్చింది. అతని కూతురు ఇంద్ర బాయి,అంజయ్య,జగన్ లు ఉద్యోగాలు పరిహారం కోసం నేడు పోరాడుతున్నారు.
తమ భూమి వివరాలు తెలుసు కునేందుకు జిల్లా సర్వే అధికారులకు చాలన్ కట్టారు.కురిసింగా భీమ్ వారసులు 17. 8.2010 లో రూ. 360 చెల్లించి చాలన్ కట్టారు. చలాన్ నెంబర్ 12945. భూమి కొలతల గురించి మంచిర్యాల ఆర్డిఓ B/DyIos/82/2011 తేదీ 30.11.2011 ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సర్వే అధికారి గంగాధర్ సర్వే చేసి 84/2/834లో ని మొత్తం భూమి 1.10 ఎకరాలు ఓరియంట్ యాజమాన్యం ఆధీనం లోనే ఉందని ధ్రువ పరుస్తూ పంచనామా రిపోర్ట్ ఇచ్చారు.
కురుసింగా సోము భార్య జంగుబాయి వారసులు తమ పట్టా భూమి కొలత కోసం చాలన్ కట్టి జిల్లా సర్వే అధికారు లతో భూమిని కొల్పించుకున్నారు. సర్వే నెంబర్ 84/2/21 లోని మొత్తం భూమి 2.28 ఎకరాలు ఓరియంట్ ఆధీనంలోనే ఉందని జిల్లా సర్వే అధికారి గంగాధర్ ధ్రువ పరుస్తూ పంచనామ రిపోర్ట్ 9.12.2011 నాడు సోము వారసులకు అందజేశారు. జిల్లా సర్వే అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్ తో హైకోర్టులో పిటిషన్ నెంబర్ 10956 / 2012 ఓరియంట్ యాజమాన్యంపై కేసు వేశారు. 10 సంవత్సరాల విచారణ అనంతరం ఇటీవల 24 జూన్ 2022 వీరికి అనుకూలంగా పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అమలు చేయించే బాధ్యత జిల్లా కలెక్టర్ కు అప్పచెప్పింది.
కోర్టు తీర్పు పట్టుకొని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని అధికారులు సరిగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల కైనా తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని స్థానిక ఆదివాసి సంఘాలకు ప్రజా ప్రతినిధులను వేడుకుంటూన్నారు.

