ఓరియంట్ బాధిత ఆదివాసులకు జరిగిన అన్యాయం -2
దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఓరియంట్ సిమెంట్ కర్మాగారానికి ఎలా అనుమతులు వచ్చాయి.?
![]() |
| దేవాపూర్ లో ఓరియంట్ సిమెంట్ కర్మాగార దృశ్యం |
![]() |
| ఓరియంట్ సిమెంట్ కర్మాగారానికి భూమి పూజ చేస్తున్న గుత్తేదారు గొంది బుచ్చన్న (పాత చిత్రం) |
Scv News Kasipet :--
అడవి తల్లి బిడ్డలైయినా ఆదివాసులు నివసించే అటవీప్రాంతం పై 1/70 ఏజెన్సీ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం సర్వ హక్కులను కల్పించింది.ఏజెన్సీ పరిధిలోని గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరుల ఎవరు భూములు కొనుగోలు చేయవద్దని, పక్కా నిర్మాణాలు ఇండ్లు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవద్దని ఆ చట్టం చెబుతోంది. ఏజెన్సీ చట్టం అమలులో ఉన్న దేవపూర్ ప్రాంతం లో ఆసియాలోనే అతిపెద్ద సిమెంట్ కర్మా గారం నిర్మాణానికి బిర్లా యాజమాన్యంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతు లు ఇచ్చాయి అనేది చాలామందికి అంతు పట్టలేని విషయం...
దేవాపూర్ ఏజెన్సీలో ఓరియంట్ సిమెంట్ అనుమతులు వచ్చిన విషయం గురించి తెలుసుకుందాం...!
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాం లోని అటవీ ప్రాంతాల్లోని అడవులు గుట్టలు కొండల్లో లభించే ఖనిజ సంప దలపై సర్వే చేసి గుర్తించారు. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన సున్నపురాయి, ఇనుము,బాక్సైట్, రాగి, ఎర్రమట్టి, బొగ్గు ఖనిజ సంపద ఎక్కడెక్కడ లభిస్తుందో బ్రిటిషర్లు సర్వే చేసి గుర్తించి ఖనిజ సంపద వారి హయాంలోనే తరలించడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశం పురోగతిలో వెళ్లాలంటే అటవీ ప్రాంతంలో లభించే విలువైన సహజ, ఖనిజ సంపదను ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మన పాలకులు నిర్ణయించారు.అటవీ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆదివాసులకు అటవీ ప్రాంతంలో హక్కులు కల్పించే 1/70 చట్టం అడ్డంకిగా మారింది.
అటవీ ప్రాంతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజనులను అభివృద్ధి పథం లోకి తీసుకు రావాలంటే అక్కడ దొరికే సహజ సంపదలతో పరిశ్రమలను ఏర్పా టు చేసి గిరిజనగూడాల అభివృద్ధితో పాటు,నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచవచ్చని పాలకులు నిర్ణయానికి వచ్చారు.ఇదే సాకుతో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాపాడే 1/70 చట్టానికి సవరణలు తెచ్చి అను మతులు ఇవ్వడం ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో 1978-79 సంవత్సరాల్లో బిర్లాయాజమాన్యం ఓరి యంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతు లను పొందింది.
ఓరియంట్ కర్మాగారం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ బాధ్యతను అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అప్పచెప్పారు. కలెక్టర్ పర్యవేక్షణలో నిర్మల్ ఆర్డీవో లక్షేట్ పెట్ తహసిల్దార్ సమక్షంలో భూసేకరణ జరిగింది. భూసేకరణ తర్వాత ఓరియంట్ యాజమాన్యం నిర్మాణ పనులు ప్రారం భించింది.
1980లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారానికి భూమి పూజ జరిగింది. కాంట్రాక్టు పనులు గొంది బుచ్చన్న ద్వారా మొదట బిర్లా యాజమాన్యం ప్రారంభించింది. నిర్మాణ పనులు సాగుతున్న కాలంలోనే స్థానిక గిరిజన గిరిజనేతరులకు భూములకు నష్ట పరి హారం, ఉపాధి విషయమై ఓరియంట్ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకుండానే పనులు ప్రారంభించడం పట్ల స్థానికులు వ్యతిరేకత వ్యక్తమైంది. భూనిర్వాసితులకు తగిన నష్టపరిహారం, ఉద్యోగాల హామీ ఇచ్చిన తర్వాతనే నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్మాణ పనులను అడ్డుకుని దేవాపూర్ వాసులు ఆందోళనకు దిగారు.అప్పుడు ఓరియంట్ సిమెంట్ కర్మాగారం పనులను పర్యవేక్షి స్తున్న రామచందర్రావు సమక్షంలో 1981లో స్థానికులకు ఓరియంట్ అధికారులకు చర్చలు జరిగి ఒప్పందానికి వచ్చాయి.ఈ నేపథ్యంలోనే భూమి ధర నిర్ణయము, ఉపాధి విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ఓరియంట్ యాజమాన్యా నికి చర్చలు జరిపి ఒక ఒప్పందం చేసుకున్నాయి. మెమో 813/ID/81-2 తేదీ 7-7-1981.ఈ ఒప్పందం ప్రకారం
* దేవాపూర్ ఏజెన్సీ పరిధిలోని గిరిజన గూడాలను ఓరియంట్ యాజమాన్యం దత్తత తీసుకుని రహదారులు, రక్షిత మంచినీటి పథకాలు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉచిత విద్య, వైద్యం అందించాలని ఒప్పందాం చేసుకున్నాయి.
* ఓరియంట్ సిమెంటు కర్మాగారం లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం.
* గిరిజన యువతకు సిమెంట్ పరిశ్రమలో పనిచేసేందుకు అవసరమైన పనులలో శిక్షణ కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలి.
స్థానిక గిరిజన,గిరిజనేతర యువకులు చదువుకొని ఉంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాలి.
సిమెంటు కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి.
భూ సేకరణకు సంబంధించిన వివాదాలన్ని వివాదాలన్ని నిర్మల్ ఆర్డిఓ పరిధిలోని పరిష్కరించు కోవాలని ఒప్పందం కుదుర్చు కున్నాయి. కర్మాగారం ఉత్పత్తి ప్రారంభించి నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా నిర్మాణ సమయంలో ఇచ్చిన ఒప్పందము, హామీలు అమలు కాలేదని లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
ఓరియంట్ లో భూసేకరణ ఇలా జరిగింది..
1980-81 లో పరిశ్రమ నిర్మాణం కోసం 194 ఎకరాలు.
1981-82లో టౌన్ షిప్ నిర్మాణం కోసం 250 ఎకరాలు
1985-86లో లారీ లోడింగ్, రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం 12 ఎకరాలు ఇలా మూడు దశల్లో 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఓరియంట్ యాజమాన్యం సేకరించింది.
రేపు:- భూసేకరణలో గిరిజనులకు జరిగిన అన్యాయం గురించి..


