ఇంటింటా ఇనోవేటర్ కార్యక్రమంలో మల్కపల్లి పాఠశాల విద్యార్థి చిక్రం రాజు కు అవార్డు.
![]() |
| మంచిర్యాల జిల్లా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఎన్నోవేటర్ అవార్డు తీసుకుంటున్న విద్యార్థి చక్రం రాజు, గైడ్ టీచర్ వేములవాడ రమేష్. |
Scv News Kasipet :--
కాసిపేట మండలం మలకపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి చిక్రం రాజు, గైడ్ టీచర్ వేములవాడ రమేష్ కు 'ఇంటింటా ఇన్నోవేటర్ 'కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పిల్లలు పాఠశాల హాస్టల్లో సులభంగా చేతులు కడుక్కునే పరికరానికి జిల్లా స్థాయిలో అవార్డు వచ్చింది. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాలజిల్లా కలెక్టర్ భారతీ హోళీ కేరి చేతుల మీదుగా అవార్డును అందు కున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మంచిర్యాల ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య దివాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డి టి డి ఓ నీలిమ, ఏ టి డి ఓ చిరంజీవులు, ఏ సీఎంవో రాజమౌళి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని అవార్డు తీసుకున్న విద్యార్థి చిక్రం రాజు, గైడ్ టీచర్ వేములవాడ రమేష్ ను అభినందించారు.


