కాసిపేట మండలంలో స్వాతంత్ర అమృత దినోత్సవ కార్యక్రమాలు.
![]() |
| స్వాతంత్రం అమృతోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నాయి ఎంపీపీ రోడ్డ లక్ష్మి. |
![]() |
| మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్న ఎంపీపీ రోడ్డ లక్ష్మి |
Scv News Kasipet :--
కాసిపేట మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర అమృత దినోత్సవ కార్యక్రమం లో భాగంగా ఈరోజు మండల పరిషత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు వివిధ కార్యక్రమాలను చేపట్టారు.
ఎంపీపీ రోడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో ఆధ్వర్యం లో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షులు విక్రమ్ రావు , ఎంపీడీవో ఎం ఏ అలీలు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టి కాహారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిరణ్మయి,బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్ ముత్యంపల్లి ఉపసర్పంచ్ బోయిని బాపు, కో ఆప్షన్ సభ్యుడు శిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

