దేవాపూర్ కు చెందిన 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి 30 మంది యువకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ నాయకత్వంలో దేవాపూర్ కాంగ్రెస్ నాయకుడు కనకరాజు ఆధ్వర్యంలో ఈరోజు డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ యువకుల త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి శ్రీకారం చుట్టారని,యువకులు సోనియాగాంధీ గారి రుణం తీర్చుకోవాలని తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వ మేనని కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మారావు పేట, మలికేపల్లి ఎం పి టి సి లు పార్వతి మల్లేష్,భీమ్ రావ్,ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, అన్నం కుమార్, ఖదీర్,వేణు, శాఖీర్,గాధం గట్టయ్య, మైధం రమేష్,జంగిలి రమేష్,జాడిశంకర్, అనంతరావు,ఆనంద చారి తదితరులు పాల్గొన్నారు.
