ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఎస్పీ ధర్నా.
![]() |
| కేంద్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టలని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెస్సీ కార్యకర్తలు |
Scv News Kasipeta :--
కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ బుధవారం కాసిపేట తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా msp జిల్లా ఇంచార్జ్ కలవల శరత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మెహ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణ పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా పరిష్కరించ వచ్చని నివేదించిందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఎస్సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతారని ఎదురు చూస్తే నిరాశే మిగిలిందా న్నారు.msp కార్యకర్తలతో కొద్దిసేపు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం అందచేశారు.

