అతిధి అధ్యాపకుల రెన్యూవల్ కోసం యూత్ కాంగ్రెస్ ధర్నా
Scv News Kasipet:--
కాసిపేట్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ముందు ఈరోజు అతిధి అధ్యాపకుల రెన్యూవల్ కోసం మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.అనంతరం రత్నం ప్రదీప్ మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కేజీ to పీజీ ఉచిత విద్య అని చెప్పి కనీసం ఉన్న స్కూల్స్ లో కాలేజీ లో అధ్యాపకులని పట్టించుకొనే స్థితిలో లేదన్నారు. 3 నెలల నుండి జీతాలు ఇవ్వక పోగా వాళ్ళని ఉద్యోగాన్ని రెన్యూవల్ చేయాలనే బుద్ధి లేకుండా పాలన సాగిస్తుందని విమర్శించారు . ప్రభుత్వం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉద్యోగులని ఇబ్బంది పెడ్తున్న తెరాస పార్టీ వెంటనే గెస్ట్ లెక్చరర్స్ ని రెన్యూవల్ చేసీ వాళ్ళ జీతాలు కూడా వెంటనే చెల్లించాల ని యూత్ కాంగ్రెస్ తరుపున డిమాండ్ చేయడం జరుగు తుందన్నారు. లేని యెడల శివసేనరెడ్డి గారి ఆదేశాల తో ఆందోళన కార్యక్రమాలు చెప్పడ్తామని ప్రభుత్వాని హెచ్చరిస్తున్నమ్మన్నారు.
ఈ కార్యక్రమంలో మహంకాళి,సల్లూరి సమీల్ కుమార్,జంగిలి రమేష్ యాదవ్కోట ఆదర్శ్,ప్రణయ్,బన్న రవి రాజా నవీన్, నాగురారాపు నాగురారాపు గణేష్,ప్రవీణ్బీజ్జురి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

