మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఓరియంట్ బాధిత ఆదివాసీలకు జరిగిన అన్యాయం -6

 ఓరియంట్ బాధిత ఆదివాసీలకు జరిగిన అన్యాయం -6

ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నిర్మాణం లో ఎనిమిది ఎకరాల భూమి కోల్పోయి నష్టపరిహారం ఉద్యోగం అందని కోవా పాండు కుటుంబం.

- పరిహారం, ఉద్యోగాల కోసం 30 ఏళ్లుగా పాండు వారసుల పోరాటం .

- పాండు వారసుల ఆందోళన కు దిగి వచ్చి పదేళ్ల క్రితం పర్మనెంట్ ఉద్యోగానికి బదులు తాత్కాలిక లోడింగ్ ఉద్యోగాలు ఇచ్చిన యాజమాన్యం .

- పట్టాదారు కోవా పాండు కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి...




 ఓరియంట్ లో భూమిని కోల్పోయిన పట్టాదారు కోవా పాండు వారసులు.
Scv News Kasipet:--

కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కోవా రాము,కోవా పాండు ఇద్దరు అన్నదమ్ములు.రాముకు బొజ్జు,హను మంతు,బారిక్ రావు ముగ్గురు కుమారు లు. కోవా పాండుకు రాము,లచ్చు, మానుకు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి తండ్రి కోవా భీమ్ నైజాం  ప్రభుత్వ హాయంలో జీవనోపాధి కోసం సర్వే నెంబర్ 84/1లో 16ఎకరాల భూమి పంపిణీ చేశారు.తండ్రి మరణానంతరం ఈ భూమిని ఇద్దరు అన్నదమ్ములు కోవా రాము,పాండు చెరి ఎనిమిది ఎకరాలు పట్టాలు చేసుకున్నారు. 1980 లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నిర్మాణం లో భూసేకరణలో వారి16 ఎకరాల భూమి మొత్తం కోల్పోయారు.కొవా రాముకు  చెందిన ఎనిమిది ఎకరాల భూమి కింద అతని ఇద్దరు కుమారులు కోవా బొజ్జు, కొవా హనుమంతుకు కంపెనీ ఉద్యోగాలు ఇచ్చింది.కోవా పాండుకు చెందిన ఎనిమిది ఎకరాల భూమి ఓరియంట్ నిర్మాణంలో పోయిన ముగ్గురు కొడుకులు ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.ఇద్దరు అన్నదమ్ము ల పట్టా భూములు వేరయినా రాము కుటుంబంలో రెండు ఉద్యోగాలు ఇచ్చి , పాండు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వక పోవడంతో పాండు ముగ్గురు కుమారులు తమకు అన్యాయం  జరిగింది.న్యాయంచేయాలని గత 40 ఏళ్లుగా ఓరియంట్ యాజమాన్యం, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ నే ఉన్నారు. తమకు జరిగిన అన్యాయం పై న్యాయం చేయాలని కార్మాగారం ముందు ఎన్నోసార్లు ఆందోళనకు దిగారు.

వీరి ఆందోళనలకు ప్రజాప్రతినిధుల ఒత్తిడి కి ఓరియంట్ యాజమాన్యం దిగివచ్చి  2012లో పాండు వారసులైన ముగ్గురి కుమారులకు ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. తమ కుటుంబంలోని ఐదుగురికి ఉద్యోగాలు ఇవ్వాలని పాండు వారసులు పట్టుబట్టగా,లోడింగ్ ఉద్యోగు లైతే ఐదుగురికి,పర్మినెంట్ ఉద్యోగాలు అయితే ముగ్గురికి మాత్రమే ఇస్తామని యాజమాన్యం మెలిక పెట్టింది. పర్మినెంట్ ఉద్యోగాలు కావాలని పాండు వారసులు పట్టుపట్టడంతో ప్రస్తుతం మాత్రం ముగ్గురికి  కోవా రాము,లచ్చు, మానుకు లోడింగ్ ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరం తర్వాత పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. 2012లో లోడింగ్ ఉద్యోగులుగా కోవా రాము,లచ్చు, మానుకు లకు ఉద్యోగాలు కల్పించింది.సంవత్సరం తర్వాత పర్మి నెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నా  హామీని తుంగలో తొక్కింది. తాను ఇచ్చిన హామీ మేరకు పర్మినెంట్ ఉద్యోగులుగా ఇవ్వాలని పాండు వారసులు పదేళ్లుగా కోరుతున్న యాజమాన్యం పట్టించు కోవడంలేదు.

లోడింగ్ లో ఉద్యోగులుగా నియమించిన గత పది సంవత్సరాలుగా నెలకు రెండు,మూడు డ్యూటీల కంటే  ఎక్కువ దొరక కపోవడంతో చాలి చాలని జీతాల తో తమ కుటుంబాలను పోషించు కోలేక పోతున్నామని కోవా పాండు వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఒప్పందం వల్ల 20 మాస్టర్ లకు పైగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి.

తమ భూమికి పరిహారము, ఉద్యోగాలు కావాలని 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన కోవరాం దంపతులు.

 కోవా రామ్ దంపతులు 

తన వంతుగా వచ్చిన ఎనిమిది ఎకరాల భూమి కంపెనీ నిర్మాణంలో పోయిందని తమకు న్యాయం చేయాలని 30 ఏళ్లుగా  కొవా పాండు పెద్ద కుమారుడు రామ్ దంపతులు ఓరియంట్ యాజమాన్యంపై  పై అలుపెరుగని పోరాటం చేశారు.  రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. దేవాపూర్ లో ఎన్నికల సమయంలో వచ్చే నాయకులకు బహిరంగ సభల్లో మాట్లాడే నాయకులకు తమ గోస చెప్పుకొనే వారు.

కోవా రాం దంపతులు మాట్లాడుతూ ఎట్టకేలకు 30 ఏళ్ల  పోరాటం ఫలించి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించడం మాకు ఆనందం కలిగించిందన్నారు. మళ్ళీ యాజమాన్యం ఇచ్చిన మాట తప్పడం మాకు బాధ కలిగిస్తుందని అన్నారు. సంవత్సరం తర్వాత లోడింగ్ ఉద్యోగాల నుండి పర్మినెంటు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం తన మాట నిలుపుకోవడం లేదని  కోవా రామ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమ హామీలను నిలబెట్టుకోవాలని కోవ రాం దంపతులు వేడుకుంటున్నారు. కలెక్టర్   ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.