ఓరియంట్ బాధిత ఆదివాసులకు జరిగిన అన్యాయం -11
న్యాయం కోసం రెండు
దశాబ్దాలుగా ఓరియంట్
యాజమాన్యంతో పోరాడు
తున్న ఆదివాసి మహిళ
కోవా ఇంద్రుబాయి.
![]() |
| భూములు వారసులకు ఉద్యోగాలు కావాలని ఓరియంట్ యాజమాన్యంపై పోరాడుతున్న ఇంద్రుబాయి. |
![]() |
| రెవెన్యూ రికార్డుల్లో తమ భూమిని చూపెడుతున్న ఇన్ ఇంద్రుబాయ్ కుటుంబ సభ్యులు. |
Scv News Kasipet :--
అడవి తల్లిని, భూమిని నమ్ముకొని బతికే ఆదివాసిబిడ్డల వారు.రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద గిరిజనులు వారు. తమకున్న కొంత భూమిలో వర్షాధార పంటలు జొన్న,కంది,పెసర పంటలు పండించుకుని వాటిని ఆహారంగా తీసుకుంటూ జీవనం సాగిస్తున్నా బడుగు జీవులువారు. ఓరియంట్ యాజమాన్యం తమకున్న కొంత భూమిని కూడా కార్మాగారంలోని కన్వేయర్ బెల్ట్ అవసరాల కోసం స్వాధీనం చేసుకోవడంతో తన జీవనాధారాన్ని కోల్పోయారు. కోల్పోయిన భూమికి పరిహారం, తమ వారసులకు ఉద్యోగాలు వస్తాయని వాటితో తాము హాయిగా బ్రతకవచ్చని గిరిజన దంపతులు ఆశపడ్డారు. కానీ యాజమాన్యం ' మీభూమి మేము తీసుకోలేదు, అడవిలోను గుట్టల్లో ఉందని' బుకాయించడంతో తాము పెట్టుకున్న ఆశలు అడియాశలయి నిరుపేద ఆదివాసి కుటుంబం రోడ్డున పడింది. భూమి పోయిందనే మనోవేదనతో కొంతకాలానికి ఇంటి పెద్ద మృతి చెందాడు. ఆ ఇంటికి పెద్దదిక్కుగా తల్లి ఇంద్రుబాయి న్యాయం కోసం నడుంకట్టింది.
ఓరియంట్ స్వాధీనం చేసుకుని కన్వేయర్ బెల్ట్ వేసుకున్న భూమికి, పరిహారం ఉద్యోగం ఇవ్వాలని గత 20 ఏళ్లుగా ఓరియంట్ యాజమాన్యం పై రాజీలేని పోరాటం చేస్తోంది.తన పిల్లలతో తన భర్త ఉన్నప్పుడు సాగుచేసిన తన పట్టా భూమిలోకి వెళ్లి బైఠాయించి ఎన్నోసార్లు కన్వేయర్ బెల్ట్ ను అడ్డుకుంది. యాజమాన్యం పోలీసుల అండతో ఆమెను అక్కడ నుండి తరలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. న్యాయం కోసం ఎన్నోసార్లు ఓరియంట్ కర్మాగారం గేటు ముందు కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకుల చుట్టూ ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్న తన బాధను పట్టించు కునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇటీవల తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఓరియంట్ కర్మాగారం ముందు జరిగిన ధర్నాలు ఆదివాసి మహిళ ఇంద్రుభాయి ఆవేశంతో 20 ఏళ్లుగా తాను భూమి కోల్పోయి న్యాయం కోసం యాజమాన్యం చుట్టూ ఎలా తిరుగుతుందో, భూమి కోల్పోయి ఎన్ని కష్టాలు పడుతున్నామొ వివరించడం అందరికీ కంట నీరు పెట్టించింది. నిరుపేద గిరిజనులకు ఓరియంట్ యజమాన్యం నుండి పరిహారం, ఉద్యోగాలు ఇప్పించడం లో ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధు ల, నాయకులు ఘోరంగా విఫల మయ్యా రనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నా యి.
కోవా ఇంద్రు బాయి కి జరిగిన అన్యాయం గురించిన వివరాలు ఇలా ఉన్నాయి..
దేవాపూర్ అచ్యుతరావు గూడానికి చెందిన కోవా ఇంద్రు బాయికి మద్దిమాడ శివారులో తన భర్త కోవ బొజ్జు పేరిట సర్వే నెంబర్ 84 / 136లో 2.20 ఎకరాల భూమి ఉంది.
ఓరియంట్ యాజమాన్యం కర్మాగారం నిర్మాణం కోసం గతంలో గిరిజన రైతుల నుండి రెవెన్యూ శాఖ ద్వారా భూమిని సేకరించింది. ఆవరణ చుట్టూ గోడ కట్టుకుంది. సిమెంటు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు సున్నపు రాయిని పడమర ప్రాంతంలోని అడవి, గుట్టల నుండి తెచ్చుకుంటుంది. ముడి సరుకును తీసుకువచ్చేందుకు1987లో కన్వేయర్ బెల్ట్ వేసుకుంది. కన్వేయర్ బెల్ట్ వేసుకునే స్థలంలోనే అటవీ భూములతో పాటు ఇంద్రుబాయి మరి కొంత మంది రైతులకు చెందిన భూములు కోల్పోయారు. వారిలో కొంత మందికి పరిహారము, ఉద్యోగాలు ఇచ్చారు .ఇంద్ర బాయ్ కి 2.20 ఎకరాల భూమి కన్వేయర్ బెల్ట్ నిర్మాణంలో కోల్పో యింది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 1.03 ఎకరాలు మాత్రమే పోయిందని వుంది. మిగతా 1.17 ఎకరాలు ఎక్కడ ఉందో తెలియడం లేదు. మొత్తం భూమి ఓరియంట్ ఆధీనంలో ఉందని పరిహారం, ఉద్యోగాలు ఇవ్వలేదని కోవా ఇంద్రుబాయి ఆరోపిస్తోంది.
ఓరియంట్ యాజమాన్యం మాత్రం మీ భూమిని తీసుకోలేదని గతంలో మేము సేకరించిన భూమి నుండే కన్వేయర్ బెల్ట్ వేసుకున్నామని మీభూమి సమీపంలోని అడవిలో గుట్టలోని ఉండవచ్చని తప్పిం చుకుంటుంది. ఎన్నో ఏళ్ళ నుండి వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకునే భూమి ఎక్కడికి పోతుంద ని కంపెనీ ఆధీనంలోనే ఉందని ఇంద్రుబాయి వాదిస్తుంది. కంపెనీ స్వాధీనం చేసుకున్నా భూమికింద తన కొడుకులు కోవా రాజు, బారిక్ రావు, కాంతారావు లకు ఉద్యోగాలివ్వాలని గత 20 ఏళ్లుగా పట్టువదలకుండా ఓరియంట్ యాజమాన్యంపై పోరాడుతుంది.యాజ మాన్యం స్వాధీనం చేసుకున్న భూమి పక్కనె మరికొంత భూమి ఉంది. దాన్ని కూడా యాజమాన్యం సాగు చేసుకొ నివ్వడం లేదని కన్వేయర్ బెల్ట్ వైపు వెళ్ళకుండా పెన్సింగ్ వేసుకున్నదని ఇంద్రుబాయి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కోల్పోయిన భూమికి పరిహారం ఉద్యోగా లు ఇవ్వాలని చాలాసార్లు తన కొడుకుల తో వెళ్లి కన్వేయర్ బెల్ట్ నడవకుండా అడ్డగించింది.కర్మాగారం ప్రధాన గేటు ముందు ఆందోళన చేసిన ఫలితం లేదు.
గ్రామంలోని నిర్వాసిత రైతులతో పాటు తాను కూడా జిల్లా సర్వే అధికారులకు తన భూమిని కొలవాలని 25 ఆగస్టు 2008లో రూ.360 చెల్లించి చాలన్ కట్టింది. చాలాన్ నెంబర్ 12397. జిల్లా సర్వే అధికారులు 2010లో భూములు కొలతలు నిర్వహించారు. పంచనామా రిపోర్ట్ ను ఇవ్వడం లేదు. భూనిర్వాసితు లకు ఉద్యోగాలు,పరిహారం చెల్లించాలని ఇటీవల గిరిజన పోరాట హక్కుల సంస్థ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఓరియంట్ ప్రధాన గేటు ముందు ఆదివాసీలు ఆందోళ నకు దిగారు.ఓరియంట్ యాజమాన్యం తనకు చేసిన అన్యాయం పై ఆదివాసి వృద్ధురాలు ఇంద్రుబాయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేశం పూరితనంగా మాట్లాడడం పలువురిని కలచివేసింది. ఇప్పటికైనా తాను కోల్పోయిన భూమి కింద తన కొడుకులు రాజు, బారిక్ రావు లకు ఉద్యోగాలు ఇచ్చే లా స్థానిక ప్రజా ప్రతినిదులను, గుర్తింపు కార్మిక సంఘం నాయకులను వేడుకుంటుంది.

