ఓరియంట్ బాధిత ఆదివాసులకు జరిగిన అన్యాయం - 8
ఓరియంట్ యాజమాన్యం భూ ఆక్రమణలన్నీ నిజాలే నని చట్టబద్దమైన న్యాయ పోరాటంలో 30 ఏళ్లకు రుజువు చేసిన అలుపెరుగని గిరిజన పోరాట యోధుడు సిడాం తెలంగారావు.
- జిల్లా సర్వే అధికారుల కొలతలతో ఓరియంట్ ఆధీనంలోనే తన భూమి ఉన్నదని చట్టబద్ధంగా గుర్తింపు.
- న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన తెలంగారావు కుటుంబం.
- గత పదేళ్లుగా హైకోర్టు తీర్పును అమలు చేయక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర .
![]() |
| ఓరియంట్ పై అలుపెరుగని పోరాటం సాగించి విజయం సాధించిన సిడాం తెలంగారావు. |
![]() |
| సిడాం తెలంగారావు కుటుంబం |
![]() |
| తెలంగారావు కు జిల్లా సర్వే అధికారులు ఇచ్చిన పంచనామ, సర్వే రిపోర్ట్ కాపీలు. |
Scv News Kssipet:--
ఓరియంట్ యాజమాన్యం ఆదీనంలోనే తమ వందలాది ఎకరాల భూములు ఉన్నాయని తమకు పరిహారం ఉద్యోగా లు ఇవ్వాలని గత 30 ఏళ్లుగా అమా యక ఆదివాసి కుటుంబాలు ఓరియం ట్ సిమెంట్ కర్మాగారం ముందు ఆందోళనలు,నిరసన దీక్షలు చేపడుతు న్నాయి. ఓరియంట్ యాజమాన్యం మాత్రం వారి న్యాయమైన సమస్యల ను పరిష్కరించకుండా కనికరం లేకుం డా మీ భూములు మా వద్ద లేవు, సమీప అడవుల్లో గుట్టల్లో ఉన్నాయని బుకాయిస్తూంది. ఈ భూములతో మాకు సంబంధం లేదు. రెవెన్యూ శాఖను సంప్రదించాలని మొండికేసి పట్టా దారులైన ఆదివాసులకు అన్యా యం చేస్తూ వచ్చింది. భూసేకరణలో తమ ప్రమేయం లేదని రెవెన్యూ అధి కారులు సూచించిన వారికే పరిహారం ఉద్యోగాలు ఇచ్చామని గత 40 ఏళ్లుగా తప్పించుకుంటూ వచ్చింది. తెలంగా రావు అలుపెరుగని పోరాటం వల్ల నిప్పులాంటి నిజాలు బయటికి వచ్చి ఓరియంట్ యాజమాన్యం దొంగ నాటకానికి తెర పడింది....
చట్టబద్ద న్యాయ పోరాటంలో ఓరియంట్ యాజమాన్యం పై తెలంగరావు విజయం.
సిడాం తెలంగారావు కుటుంబానికి చెందిన అతని పెదనాన్న దేవాపూర్ పెద్ద పటేల్ జలపతి, వారి నాన్న బిలాజి పేరిట ఉన్న 85 ఎకరాల భూమి ఓరియంట్ సిమెంట్ కర్మాగార నిర్మాణంలో పోయింది.35 ఎకరా లకు పరిహారం,ఐదుగురికి మాత్రమే ఉద్యో గాలు ఇచ్చారు.మిగతా 50 ఎకరాల పట్టా భూములకు పరిహారము, తమ కుటుంబ వారసులైన 35 మందికి ఉద్యోగాలు ఇవ్వా లని తెలంగారావు ఓరియంట్ యాజమా న్యంపై పోరాటానికి దిగాడు.గత 30 ఏళ్లుగా తమకు న్యాయం జరగాలని పోరాటం చేసిన యాజమాన్యం దిగిరాక పోవడంతో గిరిజన సొసైటీ పేరిట సిడాం తెలంగారావు, కుర్సింగ హనుమంతరావు నాయకత్వంలో భూ నిర్వాసితుల కుటుంబాలు చట్టబద్ధమైన న్యాయ పోరాటానికి దిగారు.
సమాచార హక్కు చట్టం ద్వారా రెవెన్యూ శాఖ ద్వారా ఓరియంట్ సిమెంట్ యాజ మాన్యం సేకరించిన భూమి వివరాలు తీసుకున్నారు.దాని ఆధారంగా ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నిర్మాణంలో భూము లు కోల్పోయిన 175 మంది భూనిర్వాసి త రైతులతో భూమి కొలతల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సర్వే అధికారు లకు 2008లో చాలన్ కట్టించారు. రెవె న్యూ అధికారులు జిల్లా కలెక్టర్ చుట్టూ సంవత్సరాలుగా తిరిగినా పట్టించు కోలే దు.ఓరియంట్ ఆధీనంలోని భూములకు జిల్లా సర్వే అధికారుల వద్ద నిర్వాసిత రైతులు కట్టిన చాలన్లతో రీ సర్వే చేయాలని తెలంగారావు 2008లో హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు భూనిర్వాసితులకు అను కూలంగా తీర్పు ఇచ్చి సర్వే చేయిం చాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కోర్టు ఆదేశించిన రెండు సంవత్సరాల తర్వాత 2010లో జిల్లా సర్వే అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఓరియంట్ కర్మాగారం ఆదీనంలో ఉన్న భూముల కొలతలు ప్రారంభ మయ్యాయి. తెలంగా రావు నాన్న బిలాజి కి చెందిన సర్వే నెంబర్ 72లోని 6.06 ఎకరాల భూమి మొత్తం ఓరియంట్ సిమెంట్ యాజమాన్యం ఆధీనంలో ఉందని జిల్లా సర్వే అధికారులు సర్వే నిర్వహించి తేల్చారు.దానికి సంబంధించిన పంచ నామా నివేదిక కూడా తెలంగారావుకు అందించారు. దీంతో గత 30 ఏళ్లుగా ఓరియంట్ యాజమాన్యం గిరిజనుల భూములు తమ ఆధీనం లేవని బుకా యించిన దొంగ మాటలకు చరమ గీతం పాడినట్లయింది. ఓరియంట్ యాజమా న్యంపై ఇన్నాళ్లకు విజయం సాధించామని నిర్వాసిత కుటుంబాల్లో ఆనందం విరిసిం ది. జిల్లా సర్వే అధికారులు ఇచ్చిన పంచ నామా నివేదికతో కోల్పోయిన భూముల కు నష్ట పరిహారంతో పాటు 35 మందికి ఉద్యోగాలు కల్పించాలని మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. జిల్లా సర్వే అధికారుల పంచానామ రిపోర్టుల ఆధారం చేసుకొని తెలంగారావు బంధువు లందరికీ పరిహా రం ఉద్యోగాలు కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పును అమలు పరిచే బాధ్యత అప్పటి ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా కలెక్టర్ కు అప్ప చెప్పింది. కోర్టు తీర్పును అమలు కాకుండా ఓరియంట్ యాజమాన్యం తన పలుకుబడిని ఉప యోగించి గత ఎనిమిది సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
![]() |
| అనారోగ్యంతో మృతి చెందిన తెలంగరావు |
కోర్టు తీర్పు అమలు కాకుండానే తెలంగరావు మృతి.
గత 36 ఏళ్లుగా తన తోటి ఆదివాసులకు జరిగిన అన్యాయం పై అలుపెరుగని పోరాటం చేసిన తెలంగావు కోర్టు తీర్పు ఫలితాలు చూడకుండానే 14 నవంబర్ 2012 లో అనారోగ్యంతో మృతి చెందడం విషాదకరం. ఓరియంట్ యాజమాన్యంపై దీర్ఘకాలిక పోరాటం చేసి విజయం సాధించి అమా యక ఆదివాసి భూనిర్వాసితుల కుటుం బాలకు వెలుగులను అందించిన స్ఫూర్తి ప్రదాత సిడాం తెలంగారావు.
గిరిజన సంఘాలు తెలంగారావును ఆదర్శంగా తీసుకుని పోరాడాలి.
అలుపెరుగని పోరాట యోధుడు తెలంగారావు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అతను చూపెట్టిన మార్గంలోనే దేవాపూర్ ఓరియంట్ భూ నిర్వాసిత ఆదివాసి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని కొన సాగించాలని గిరిజన సంఘాలను సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.
నోట్ :- రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ ఓరియంట్ బాధిత ఆదివాసులకు అన్యాయం కథనాలు ప్రారంభం.





