మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సల్పాల వాగును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు తెరాస నాయకుల వినతి.

 సల్పాల వాగును  పర్యాటక

ప్రాంతంగా తీర్చిదిద్దాలని

ఎమ్మెల్యేకు తెరాస

నాయకుల వినతి.

 సల్పన వాగును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు  కాసిపేట మండలం తెరాస నాయకులు వినతి.
Scv News Kasipeta:--

 కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని సలపాలవాగు  ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు రమణా రెడ్డి ఆధ్వర్యంలో  మండల టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు, మంచిర్యాల జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు తొంగల సత్యనారాయణకు  వినతి పత్రం అందజేశారు. వర్షాకాలంలో  సల్పల వాగు  ప్రాంతం చుట్టూ కొండల పచ్చదనం, చలవరాళ్ల పై  నీళ్ల ప్రవాహం చూడ ముచ్చటగా ఉంటుందని, పకృతి అందాలు చూసేందుకు మండల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా విహార యాత్రలకు వస్తుంటారని నాయకులు ఎమ్మెల్యేకు తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం గజాల భీమన్న,  దేవాలయాలతో పాటు రామాలయం, ఆంజనేయ దేవాలయం కు ప్రతి రోజు భక్తులు మొక్కులకు వస్తూ ఉంటారని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా గిరిజనుల దండారి దర్బార్ కూడా జరుపుతున్నామని,  మండల ప్రజ లందరినీ ఆకట్టుకున్న సల్ఫల వాగు  ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని  నాయకులు ఎమ్మెల్యేకు  వినతిపత్రంలో తెలిపారు. 


గట్రావుపల్లిలో  గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి వినతి.

మండలంలోని గట్రావుపల్లి గ్రామంలో 18 గ్రామైక్య సంఘాలు ఉన్నాయని ప్రతినెల సమావేశం పెట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ పద్రం  రాజు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు, మంచిర్యాల జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు తొంగల సత్యనారాయణకు  వినతి పత్రం అందజేశారు. సమైక్య సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సర్పంచ్ తెలిపారు.వినతి పత్రాలు  అందజేసిన వారిలో ఓరియంట్ సిమెంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి , మద్దిమాడ, గట్రావు పల్లె  సర్పంచులు  ఆడ జంగు, పంద్రం రాజు, దేవాపూర్ టిఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వడ్లూరు మల్లేష్, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్  గిరిజన సంఘాల  నాయకులు మడావి  అనంతరావు, పెంద్రం  హనుమంతు, కైలాస్  తదితరులు వున్నారు.