ఓరియంట్ సిమెంట్ గేట్
ముందు విద్యార్థుల
తల్లిదండ్రుల ఆందోళన.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కార్మాగారం ముందు విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆందోళనకు దిగారు. ఓరియంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మేలగిరి పాటశాలను ఎత్తివేసి వేరే పాఠశాల యాజమాన్యానికి ఓరియంట్ యాజమాన్యం ఇటీవల పాటశాలను అప్పచెప్పింది . నూతన పాఠశాల యాజమాన్యం మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉండడంవల్ల 9,10వ తరగతి తెలుగు మీడియం విద్యార్థులు వేరే పాఠశాలలకు వెళ్లాలని టీసీ లు తీసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు తెలుగు మీడియం కొనసాగించాలని ఓరియంట్ గేటు ముందు వచ్చి ఆందోళన కు దిగారు . ఆందోళనకు దిగిన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ఓరియంట్ హెచ్చార్ ఏజీఎం శ్రీనివాస్, గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ఆదివాసి నాయక్ పోడ్ సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు లు తల్లిదండ్రుల తరపున ఓరియంట్ యాజమాన్య అధికారులతో మాట్లాడారు. ఓరియంట్ అధికారులు డీఈఓ తో మాట్లాడీ నిర్ణయం తీసుకుంటామని తెలపడంతో తల్లిదండ్రులు శాంతించారు. ఓరియంట్ పాఠశాలలో రెండు సంవత్సరాలు తెలుగు మీడియం కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

