వీఆర్వోల జాబ్ చార్ట్ ను
ప్రకటించాలని, వీఆర్వోలను
రెవెన్యూ శాఖ లోకి
తీసుకోవాలని ఆందోళన.
Scv News Kadipet:---
రెవెన్యూ శాఖ లో పనిచేసే విఆర్వోలకు స్పష్టమైన పని విధానం ( జాబ్ చార్ట్) ప్రకటించాలని, వేరే డిపార్ట్మెంట్ లకు బదిలీ చేసిన వీఆర్వోలను రెవెన్యూ శాఖ లోకి తీసుకోవాలని, పదోన్నతులు కల్పించాలనే తదితర డిమాండ్లతో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాశీపేట్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు సోమవారం రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఇవన్నీ కార్యాలయాల నుండి విఆర్ఓలకు విధులను తొలగించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా వీఆర్వోల కు ఇంతవరకు పని చూ పెట్టకుండా ప్రభుత్వం మానసికంగా వేధిస్తున్నారని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. 2015 నుండి విఆర్వో కుటుంబాలలో అకాల మరణం చెందిన వారి కి కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని, వెంటనే చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ రెగ్యులర్ కానీ వీఆర్వోలకు రెగ్యులర్ చేయాలని, జంట బదిలీలు చేపట్టాలని తదితర డిమాండ్లతో రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనలో పాల్గొన్న వారిలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈశ్వర్, ఉపాధ్యక్షుడు ప్రశాంత్, ఉద్యోగులు లింగయ్య, రామయ్య లక్ష్మయ్య, ప్రేమ్ సాగర్, రవీంద్ర శౌరి, తదితరులు పాల్గొన్నారు.
