కేటీఆర్ అనుచిత
వ్యాఖ్యలకు నిరసనగా
కాసిపేట మండలంలో
విశ్వబ్రాహ్మణుల
విశ్వరూపం.
![]() |
| విశ్వబ్రాహ్మణుల బైక్ ర్యాలీ |
Scv News Kasipet:--
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన విశ్వ బ్రాహ్మణ కులస్తులపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం కాసిపేట మండలంలో బైక్ ర్యాలీలు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, తాహాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించి విశ్వ బ్రాహ్మణులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇటీవల కేటీఆర్ ఒక సమావేశంలో కేంద్ర బీసీ కమిషనర్ బీపీ ఆచార్య నుద్దేశించి 'చారీ, పప్పు చారి, 'గొట్టంగాడు ' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో విశ్వబ్రాహ్మణులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాసిపేట మండలంలోని విశ్వబ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి శిలోజు మురళి, మండల కమిటీ అధ్యక్షుడు జంబోజు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొండాపూర్ యాప కేంద్రం నుండి మండలంలోని వివిధ గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కాసిపేట, దేవాపూర్ పోలీస్ స్టేషన్లలో కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని తాహాసిల్దార్ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విశ్వ బ్రాహ్మణులు ప్రొఫెసర్ జయశంకర్, మారోజు వీరన్న, శ్రీకాంతాచారి ప్రాణ త్యాగాల వల్లనే వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణులకు 8 ఏళ్ల తెరాస పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంకిత భావంతో ఉద్యమాల్లో పాల్గొన్న విశ్వ బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క ' రావు 'కూడా ప్రాణత్యాగం చేయలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన మొత్తం 'రావుల' చేతుల్లోకి వెళ్లి ఇష్ట రాజ్యంగా దోచుకు తింటూన్నారని విమర్శించారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన సాగుతుందని రాష్ట్ర సంపదనంతా కుటుంబ సభ్యులు దోచుకు తింటు రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. విశ్వబ్రాహ్మణుల అవమానించిన కేటీఆర్ భేషరతుగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని లేకుంటే కల్వకుంట్ల పాలన అంతం అయ్యేంతవరకు విశ్వబ్రాహ్మణులు రాజీలేని పోరాటం చేస్తారని హెచ్చరించారు.
విశ్వబ్రాహ్మణుల మండల శాఖ అధ్యక్షులు జంబోజి కృష్ణమూర్తి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్, కోశాధికారి సజ్జనపు ఆనంద చారి తో పాటు మండలం లోని వివిధ గ్రామాలలోని విశ్వబ్రాహ్మణు లంతా పాల్గొన్నారు.




