విశ్వబ్రాహ్మణ మండల కమిటీ నాయకులకు సన్మానం.
![]() |
| సోమగూడెం విశ్వబ్రాహ్మణ సంఘం వార్షికోత్సవం సందర్భంగా మండల కమిటీ నాయకులకు సన్మానం |
Scv News Kasipet :--
కాసిపేట మండలం సోమగూడెం కె గ్రామ విశ్వబ్రాహ్మణ కమిటీ వార్షికోత్సవ సందర్భంగా గురువారం సోమగూడెం గ్రామంలో సమావేశమైంది. సమావేశంలో ప్రభుత్వం నుండి రావాల్సిన అప్పులు సమస్యలపై చర్చించబడింది. తదనంతరం మండల కమిటీ నాయకులను సన్మానించారు.సన్మానం పొందిన వారిలో మండల కమిటీ అధ్యక్షులు జంబో జి కృష్ణమూర్తి , ప్రధాన కార్యదర్శి గొల్లపెల్లి రాజేందర్, కోశాధికారి ఆనందాచారి, రాష్ట్ర సహాయ కార్యదర్శి శిలోజు మురళి ఉన్నారు. ఈ కార్యక్రమం లో సంకోజు సాంబయ్య, అలుగోజు తిరుపతి, తిరుమల చారి, తిరుపతి చారి, శిలోజు రాజ చారి, కృష్ణ చారి సందీప్ చారి తదితరులు పాల్గొన్నారు.
