వర్షానికి నేలకొరిగిన ఎగ్గెండి పోచమ్మ గుడి.
![]() |
| భారీ వర్షాలకు నేలకొరిగిన ఎగ్గెండి పోచమ్మ గుడి దృశ్యం |
![]() |
| కూలిపోయిన ఎగ్గెండి పోచమ్మ గుడి ని పరిశీలిస్తున్న వెంకటాపూర్ సర్పంచ్ సౌందర్య శంకర్ |
Scv News Kasipeta:--
కాసిపేట మండలం వెంకటాపూర్ పంచాయితీలోని ప్రజల ఆరాధ్య దైవంగా కొలిచే ఎగ్గెండి పోచమ్మ దేవాలయం భారీ వర్షాలకు నేలకొరిగింది. పోచమ్మ గుడి తిర్యాని మండలానికి వెళ్లే రహదారి పక్కనే ఉంది. దశాబ్దాలుగా కాసిపేట తిర్యాని మండలాల గ్రామాల ప్రజలు వర్షాకాలానికి ముందు పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. పంటలు పండిన తర్వాత కూడా కుటుంబ సభ్యులతో వచ్చి మొక్కులు తీర్చుకొని విందులు చేసుకుంటారు. దశాబ్దాలుగా గడ్డి గుడిసెలోనే ఉన్న ఎగ్గెండి పోచమ్మ గుడి గత కొద్ది రోజులుగా శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండటంతో నేలకొరిగింది. సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎగ్గెండి పోచమ్మ దేవాలయం నిర్మించాలని కోరుతున్న పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనె విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కూలిపోయిన ఎగ్గెండి పోచమ్మ దేవాలయాన్ని వెంకటాపూర్ సర్పంచ్ మడావి సౌందర్య - శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ భక్తులు మొక్కులు తీర్చుకునే విధంగా తాత్కాలికంగా రేకులతో షెడ్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. భక్తులు నాయకుల విరాళాలతో పోచమ్మ దేవాలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

