కొండాపూర్ లో సామాజిక
చైతన్య వేదిక కార్యవర్గ
సమావేశం.
SIcv News Kasipet :---
కాసిపేట మండలం కొండాపూర్ యాపలో ఆదివారం సామాజిక చైతన్య వేదిక కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో సా చై వే విస్తరణ, భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంగా సామాజిక చైతన్య వేదిక మండలంలో చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు వివరించారు. ఉపాధ్యక్షులు గోడిసెల రాజేశం మాట్లాడుతూ సామాజిక చైతన్య వేదిక భవిష్యత్తులో మండలంలోని వివిధ గ్రామాలలో ప్రధాన ఎజెండా ను తయారు చేసుకొని పనిచేయాలని సూచించారు. కార్యదర్శి మెండ్రపు రాజన్న మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలతోపాటు పాఠశాలల్లో కూడా విద్యార్థులను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతు త్వరలో మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏ జెండాను తయారు చేసుకొని సభ్యులు సూచించిన మేరకు ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. సమావేశంలో సభ్యులు మడావి తిరుపతి, జాడి రాంజీ, కే మహేష్ లు పాల్గొన్నారు.

