ఎమ్మార్పీఎస్ నాయకులను
అదుపులోకి తీసుకున్న
పోలీసులు.
Scv News Kasipet :--
ఎస్సీ వర్గీకరణ ను చేపట్టాలని లేకుంటే బిజెపి జాతీయ సభలను అడ్డుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ పిలుపుమేరకు కాసిపేట మండల ఎమ్మార్పీఎస్ నాయకులు ఉద్యమానికి సమాయత్త మవు తుంటే ముందు జాగ్రత్తగా శనివారం కాసిపేట ఎస్సై గంగారాం ఆధ్వర్యంలో పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు కలవల శరత్ నాయకులు దాసరి వినయ్, లంక లక్ష్మణ్, గోడిసెల బాలయ్య, గోడిసెల భీమయ్య,పులికొండ వంశీలు ఉన్నారు.
ఈ సందర్భంగా పోలీసుల అదుపులో ఉండి విడుదలైన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కలువల శరత్ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వంద రోజుల్లో వర్గీకరణ చేపడతామని ఇచ్చిన హామీ ఏడు సంవత్సరాలు కావస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చడం లేదని విమర్శించారు. బిజెపి వర్గీకరణ చేపట్టడం లేదంటే మాదిగలను మోసం చేయడమేనని తన వైఖరిని వెంటనే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.నిండు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ బాధ్యత నాది అన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. మాదిగలు కేంద్రంపై యుద్ధం సిద్ధమైతే ఆ యుద్ధాన్ని అంచనా వేసి కుట్రలో భాగంగా ఈ అరెస్టు లు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారని విమర్శించారు. ఏది ఏమైనా కూడా ఎన్ని అరెస్టులు జరిగినా రేపు జరగబోయే బిజెపి బహిరంగ సభను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేస్తున్నామని హెచ్చరించారు.
ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపిన టిఆర్ఎస్, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు.
కాసిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీస్ స్టేషన్లో మండల ప్రజా ప్రతినిధులు జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, పెద్దన పల్లి ఎంపిటిసి కొండ బత్తుల రాంచందర్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, పెద్దన పల్లి, కాసిపేట గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు భీమయ్య, అగ్గి సత్తయ్య, టిఆర్ఎస్ నాయకుడు బడవత్ రాంచందర్ ఐకాస అధ్యక్షుడు శిలోజు మురళి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు కొత్త రమేష్ లు పరామర్శించి సంఘీభావం తెలిపారు.


