రెండో రోజు కూడా పోలీసుల
అదుపులో ఎమ్మార్పీఎస్ నాయకులు.
Scv News Kasipet:--
ఎస్సీ వర్గీకరణ వెంటనే ప్రకటించక పోతే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు ముందు జాగ్రత్తగా ఆదివారం రెండో రోజు కూడా ఎమ్మార్పీఎస్ నేతలను కాసిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో తీసుకున్న వారిలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు కలవల శరత్, దాసరి వినయ్, పులికోట వంశీ ఉన్నారు.
ఈ సందర్భంగా కలవల శరత్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ పై కేంద్ర స్పష్టమైన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయకుండా మాదిగలను మోసం చేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కు మాదిగల పై చిత్తశుద్ధి లేదని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు నిర్బంధిం చడన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు.ఎన్ని అరెస్టులు చేసిన ఎంత నిర్బంధించిన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తప్ప వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వర్గీకరణ పై జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
